Telugu News Lifestyle Here are the Benefits of Using rock salt Instead of Regular Salt, check full details
Rock Salt: ఆరోగ్యానికి మేలు చేసే ఉప్పు.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆరోగ్యానికి ఉప్పు చేటు చేస్తుందని మనకు తెలుసు. నిపుణులు సైతం ఇదే చెబుతారు. ఉప్పును ఎంత తక్కువ తింటే అంత మంచిదని సూచిస్తారు. అయితే రాళ్ల ఉప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? సాల్ట్ కు బదులుగా ఈ రాళ్ల ఉప్పు వాడితే ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుందాం రండి..
మన తాతల కాలంలో అందరూ రాళ్ల ఉప్పునే వినియోగించే వారు. ఎందుకంటే సహజ పద్ధతుల్లో తయారైన ఆ ఉప్పు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరకుతున్న రసాయనాలు కలిపిన సాల్ట్ తో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. రాళ్ల ఉప్పును సాధారణంగా సముద్రం నుంచి తయారు చేస్తారు. సముద్రంలోని నీటిని మడుల్లో నిల్వ చేసి.. నీరు ఆవిరైన తర్వాత సోడియం క్లోరైడ్ కలిగిన గులాబి రంగు స్పటికలను దానిలో వేసినప్పుడు రాళ్ల ఉప్పు తయారవుతుంది. ఆయుర్వేదంలో, సేంద నమక్(రాళ్ల ఉప్పు) ను పురాతన కాలం నుండి ఔషధ గుణాలు కలిగిన పదార్థంగా పరిగణిస్తున్నారు. ఈ రాతి ఉప్పు సాధారణ దగ్గు, జలుబును నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కంటి చూపు, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
సేంద నమక్‌లో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ వంటి శరీరానికి మేలు చేసే ఇతర ఖనిజాలు ఉన్నాయి. కానీ, ఈ పోషకాల కోసం దానిపై మాత్రమే ఆధారపడటానికి తగినంత పరిమాణంలో లేవని గమనించాలి.
తక్కువ సోడియం కంటెంట్ కారణంగా, సాధారణ ఉప్పు కంటే, సెంద నమక్ శరీరంలో సోడియం కంటెంట్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. సోడియం అధికంగా ఉన్నా.. లేక తక్కువగా ఉన్నా శరీరానికి హానికరమే.
దీనిలోని ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా, ఇది కండరాల తిమ్మిరికి, మన శరీరంలోని నరాల సరైన పనితీరుకు సహాయపడుతుంది. కానీ, ఎలక్ట్రోలైట్స్, కండరాల తిమ్మిరితో వాటి సంబంధం గురించి అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
ఆయుర్వేదం ప్రకారం, రాతి ఉప్పు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మెరుగైన ప్రేగు ఆరోగ్యం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డయేరియా మొదలైన వాటితో పోరాడటానికి సహాయపడుతుంది.
సెంద నమక్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయుర్వేదం సూచిస్తుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, సేంద నమక్ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది.