Heart Attack: గుండెపోటుకు దివ్యౌషధం ఈ చిన్ని విత్తనాలు..! ఇలా తింటే వృద్ధాప్యంలో కూడా..

ఈ విత్తనాలను సలాడ్లు, జ్యూస్‌లపై చల్లుకుని కూడా తింటారు.. దీన్ని నీటిలో నానబెట్టి తాగడం చాలా మంచిది. జనపనార గింజలు తినడం వల్ల కడుపు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా, ఇది ప్రాణాంతక గుండె సమస్యలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Heart Attack: గుండెపోటుకు దివ్యౌషధం ఈ చిన్ని విత్తనాలు..! ఇలా తింటే వృద్ధాప్యంలో కూడా..
Hemp Seeds

Updated on: Feb 11, 2025 | 8:38 AM

డ్రైఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తాపప్పులు మాత్రమే అని అనుకుంటే పొరపాటే… కానీ కాలం గడిచేకొద్దీ, అనేక కొత్త రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్‌ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు, మరో కొత్త రకం విత్తనం ఆ జాబితాలో చేరింది. అవి జనపనార విత్తనాలు. జనపనార గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, ఇనుము, జింక్, సోడియం, విటమిన్లు B6, B12, D, E పుష్కలంగా ఉన్నాయి.

ఈ విత్తనాలను సలాడ్లు, జ్యూస్‌లపై చల్లుకుని కూడా తింటారు.. దీన్ని నీటిలో నానబెట్టి తాగడం చాలా మంచిది. జనపనార గింజలు తినడం వల్ల కడుపు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా, ఇది ప్రాణాంతక గుండె సమస్యలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రోగనిరోధక శక్తి బలంగా ఉంటే, సీజనల్ వ్యాధులు దాడి చేయవు. ఈ విత్తనాలను తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా జనపనార గింజలు తినడం వల్ల కీళ్ల నొప్పులను నివారించవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ విత్తనాలను తింటే త్వరలోనే ఉపశమనం లభిస్తుంది. ఈ విత్తనాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచివి. కాబట్టి, ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..