
చాలా మంది జలుబును కొన్ని రోజుల్లో తగ్గిపోయే తేలికపాటి, హానిచేయని అనారోగ్యంగా భావిస్తారు. అయితే, జలుబు లేదా ఫ్లూ వంటి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కొన్నిసార్లు మీ గుండెపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందని, ఒక్కోసారి అది గుండెపోటుకు కూడా దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణంతో వైరల్ ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నందున, మీ శరీరం – ముఖ్యంగా మీ గుండె – అనారోగ్య సమయంలో ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడం తప్పనిసరి. జలుబు మీ గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, సురక్షితంగా ఉండటానికి మీరు ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో తెలుసుకుందాం.
జలుబు గుండెను ఎలా ప్రభావితం చేస్తుంది?:
సాధారణ జలుబు మీ శరీరంలోకి ప్రవేశించి మీ శ్వాసనాళంలో వాపును కలిగించే వైరస్‌ల వల్ల వస్తుంది. జలుబు రోగనిరోధక వ్యవస్థ సంక్రమణతో పోరాడటానికి రసాయనాలను విడుదల చేస్తుంది. అయితే, ఇది మీ గొంతు లేదా ఊపిరితిత్తులకే పరిమితం కాదు. ఇది మీ రక్త నాళాలు, గుండెను కూడా ప్రభావితం చేస్తుంది. వాపు వల్ల ధమనులు ఇరుకుగా మారతాయి. దీనివల్ల రక్తం ప్రవహించడం కష్టమవుతుంది. ఇప్పటికే ధమనులలోని ప్లాక్‌లు పేరుకుపోవడం లేదా ధమనులు బలహీనపడటం, ఇది అడ్డంకుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వచ్చిన వారంలోనే, గుండెపోటు ప్రమాదం దాదాపు ఆరు రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
శీతాకాలంలో ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుంది?:
శీతాకాలం జలుబు, గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. చల్లని ఉష్ణోగ్రతలు రక్త నాళాలను సంకోచిస్తాయి. రక్తపోటును పెంచుతాయి. గుండెను మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, అదనపు వాపు, ఒత్తిడితో పాటు ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. చల్లని వాతావరణం వల్ల ప్రజలు ఇంటి లోపలే ఉండి తక్కువ వ్యాయామం చేస్తారు. దీనివల్ల గుండె పనితీరు మరింత తగ్గుతుంది. ధూమపానం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఈ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.
ముందుగా తెలుసుకోవాల్సిన లక్షణాలు:
చాలా మంది గుండెపోటు లక్షణాలను జలుబు వల్ల కలిగే బలహీనత లేదా అలసటగా అనుకుంటారు. కానీ, కొన్ని హెచ్చరిక సంకేతాలను ఎప్పుడూ విస్మరించకూడదు. మీరు ఈ లక్షణాలను అనుభవిస్తే జాగ్రత్తగా ఉండండి. వాటిలో నిరంతర ఛాతీ నొప్పి, ఒత్తిడి, తేలికపాటి శ్రమకు కూడా శ్వాస ఆడకపోవడం, ఆకస్మిక అలసట లేదా తలతిరగడం, చేతులు, మెడ లేదా దవడ వరకు ప్రసరించే నొప్పి, సక్రమంగా లేని హృదయ స్పందన, గుండె దడ వంటివి ఉన్నాయి. జలుబు లేదా ఫ్లూ సమయంలో లేదా తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది?:
ఎవరైనా దీని బారిన పడవచ్చు, అయితే, 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు, మధుమేహం, అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు, కుటుంబపరంగా గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, ధూమపానం చేసేవారు, నిశ్చల జీవనశైలి ఉన్నవారు, ఫ్లూ లేదా COVID-19 వంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకుంటున్న వ్యక్తులు, తేలికపాటి ఇన్ఫెక్షన్ కూడా గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమం తప్పకుండా టెస్ట్‌లు చేసుకోవడం, సకాలంలో చికిత్స అవసరం.
జలుబు, ఫ్లూ కాలంలో మీ గుండెను ఎలా కాపాడుకోవాలి?:
మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి: సిట్రస్ పండ్లు, ఆమ్లా, అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను తినండి. ఇవి సహజంగా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
హైడ్రేటెడ్ గా ఉండండి: మీ శరీరం నుండి విషాన్ని బయటకు పంపడానికి గోరువెచ్చని నీరు, హెర్బల్ టీ తాగండి.
తగినంత విశ్రాంతి తీసుకోండి: అలసటను నిర్లక్ష్యం చేయకండి. కఠినమైన, అధిక శ్రమతో కూడి పనులు చేసే ముందు మీ శరీరం పూర్తిగా కోలుకునేలా చేయండి.
ఎక్కువ చలిలో ఉండకూడదు: శీతాకాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచుకోండి. గుండెపై ఒత్తిడి తెచ్చే ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులను నివారించండి.
ఉప్పు, కొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి: అధిక సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.
తగినంత వ్యాయామం చేయండి: చలికాలంలో కూడా తప్పనిసరిగా వాకింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయమాలు చేయటం అలవాటు చేసుకోండి.
లక్షణాలను విస్మరించవద్దు: జలుబు తర్వాత ఛాతీలో అసౌకర్యం లేదా అసాధారణ అలసట కొనసాగితే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.
వైరల్ ఇన్ఫెక్షన్లు కొన్నిసార్లు మయోకార్డిటిస్ (గుండె కండరాల వాపు) కు దారితీయవచ్చు. దీనికి చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి, ఎప్పుడూ సొంత వైద్యం కాకుండా నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..