ఈ మొక్క ఒక అద్భుతమైన ఔషధం.. వాసనతో అనేక వ్యాధులు పరార్‌..! ప్రయోజనాలు తెలుసుకోండి..

|

Jul 22, 2024 | 8:57 AM

రోజ్మేరీ సువాసన కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. మీరు రోజ్మేరీ ఆయిల్‌, ఆకులను ఉపయోగించి ఆవిరిపట్టుకున్నా, లేదంటే, తరచూ వాటిని సువాసనను పీల్చడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు. రోజ్మేరీని డాక్టర్ సూచించినట్లు మాత్రమే ఉపయోగించాలి. రోజ్మేరీని తగిన పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. అతిగా వాడటం వల్ల స్కిన్ అలర్జీ, తలనొప్పి, కడుపునొప్పి వస్తుంది.

ఈ మొక్క ఒక అద్భుతమైన ఔషధం.. వాసనతో అనేక వ్యాధులు పరార్‌..! ప్రయోజనాలు తెలుసుకోండి..
Rosemary Oil
Follow us on

రోజ్మేరీ అనేది ఆయుర్వేద ఔషధం. ఇది అనేక రకాలైన మెడిసిన్స్‌ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రోజ్మేరీ కొమ్మలు,ఆకులు,పొడి, విత్తనాలు మార్కెట్లో ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తాయి. రోజ్మేరీ ఆకుల తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్‌, మలబద్దం, జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజ్మేరీ ఎంతో ఉపయోగపడుతుంది. రోజ్మేరీ చూడడానికి చిన్నగా ఉంటుంది. కానీ, ఇందులో బోలెడు ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రోజ్మెరీ ఆకులు ఒక ప్రత్యేకమైన, సువాసనగల రుచిని కలిగి ఉంటుంది. ఈ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఫ్లేవనాయిడ్స్, డైటెర్పెనెస్, పాలీఫెనాల్స్, అనేక ఇతర ప్రభావవంతమైన గుణాలు నిండి ఉన్నాయి. రోజ్మేరీ ఆకులతో తయారు చేసిన నూనెను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇది పరిశోధనలో కూడా తేలింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలను మెరుగుపరచడంలో అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. రోజ్మెరీ ఆకులు జీర్ణవ్యవస్థన మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతాయి. అజీర్ణం, గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలను కూడా తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా తయారు చేస్తాయి. దీని వల్ల మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఇది క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధించడంలో ఎంతో మేలు చేస్తుంది. రోజ్మెరీ నూనెను కీళ్ల నొప్పులకు, కండరాల సమస్యలకు, తలనొప్పి వంటి వాటికి ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

రోజ్మేరీ జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రోజ్మేరీ ఒక ప్రత్యేకమైన సువాసనను ఇస్తుంది. ఇది మెదడు పనితీరును ప్రేరేపిస్తుంది. ఆలోచించే, అర్థం చేసుకునే, గుర్తుంచుకునేలా మీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజ్మేరీ మొక్క ఎండిన భాగాలను అనేక రకాలుగా ఉపయోగిస్తారు, ఇది శరీరంలోని అనేక రకాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోజ్మేరీ సువాసనను పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళన రుగ్మతలను తగ్గిస్తుంది. రోజ్మేరీ సువాసన కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

మీరు రోజ్మేరీ ఆయిల్‌, ఆకులను ఉపయోగించి ఆవిరిపట్టుకున్నా, లేదంటే, తరచూ వాటిని సువాసనను పీల్చడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు. రోజ్మేరీని డాక్టర్ సూచించినట్లు మాత్రమే ఉపయోగించాలి. రోజ్మేరీని తగిన పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. అతిగా వాడటం వల్ల స్కిన్ అలర్జీ, తలనొప్పి, కడుపునొప్పి వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..