Health Tips: చలిబాధకు తాళలేక కాఫీ, టీలు తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!

|

Jan 09, 2023 | 9:16 PM

వీటన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

Health Tips: చలిబాధకు తాళలేక కాఫీ, టీలు తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!
Tea And Coffee Cravings
Follow us on

శీతాకాలంలో తరచూ జలుబు సమస్య వెంటాడుతుంది. ఉపశమనం కోసం మీరు తరచుగా కాఫీ, టీలు తాగుతున్నారా? అలా అయితే, జాగ్రత్త! టీ, కాఫీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. కారణం టీ, కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అంతే కాదు టీ లేదా కాఫీ తాగడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. కాబట్టి, మీరు మీ ఈ అలవాటును నియంత్రించుకోవాలి. టీ లేదా కాఫీ కోసం మీ కోరికలను ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

టీ, కాఫీ వ్యసనాన్ని ఒకేసారి అరికట్టలేము.. ఈ అలవాటును క్రమంగా అరికట్టవచ్చు. మరోవైపు, మీరు రోజుకు 4-5 కప్పుల కాఫీ తాగితే, ఈ రోజు నుండి 3 కప్పుల టీ మాత్రమే తాగండి. ఇలా చేయడం వల్ల క్రమంగా ఈ అలవాటును తగ్గించుకోవచ్చు.

పసుపు పాలు..
చలికాలంలో టీ, కాఫీలకు బదులుగా ఇంట్లో తయారుచేసిన పసుపు పాలు తాగవచ్చు. ఇందులోని పుష్కలమైన పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, లోపల నుండి వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాదు, పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

ఇవి కూడా చదవండి

అల్లం, నిమ్మకాయ టీ త్రాగాలి..
చలికాలంలో టీ, కాఫీ కోసం తహతహలాడుతున్నప్పుడు, అల్లం వేడి నీటిలో వేసి మరిగించండి. తర్వాత దానికి కాస్త నిమ్మరసం, తేనె కలపాలి. ఇప్పుడే ఈ టీ తాగటం అలవాటు చేసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

చలికాలంలో టీ, కాఫీలకు బదులు గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ టీ వంటివి తీసుకోవచ్చు. వీటన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..