హార్ట్ ఎటాక్, గుండెపోటు ప్రస్తుతం ఇలాంటి వార్తలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. కానీ, మన శరీరంలో ఈ గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయని, వాటిని మనం పెద్దగా పట్టించుకోకపోవటం వల్లే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు ముందు కనిపించే లక్షణాలు, సంకేతాలలో ఛాతీ నొప్పి ఒకటి. అయితే, మనలో చాలా మందికి ఛాతీ నొప్పి అనిపిస్తుంది.. కానీ, కొన్ని రకాల చాతీ నొప్పి ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇలాంటి చాతి నొప్పి కొన్నిసార్లు అకస్మాత్తుగా చాలా తీవ్రంగా మారుతుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. అలాగే, కొన్నిసార్లు ఇది తక్కువ వ్యవధిలో జరుగుతుంది. తేలికపాటిగా వచ్చిపోతుంది.. నొప్పితో పాటు, కొందరికీ ఛాతీలో మంటగా అనిపిస్తుంది.
అయితే, కొన్ని రకాల ఛాతీ నొప్పి గుండె జబ్బులకు సంకేతం కావచ్చు.. దానిని విస్మరిస్తే అది ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె జబ్బుల విషయంలో శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా సమయానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. అందులో భరించలేనంతగా వచ్చే ఛాతీ నొప్పి చిన్నదే. దీంతో పెద్దగా ముప్పు ఏమీ ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో నొప్పి మెడ, దవడకు, తరువాత వెనుకకు లేదా కిందకి, ఒకటి లేదా రెండు చేతులకు వ్యాపిస్తుంది. మీరు ఈ రకమైన నొప్పిని అనుభవిస్తున్నట్లయితే, దానిని అస్సలు విస్మరించకూడదని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ నొప్పి గుండె సంబంధిత సమస్యలకు ప్రత్యక్ష కారణం కావచ్చునని చెబుతున్నారు. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో, వివిధ రకాల ఛాతీ నొప్పి, దానితో సంబంధం ఉన్న వ్యాధుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గుండె సంబంధిత ఛాతీ నొప్పి..
నిపుణుల ప్రకారం.. ఛాతీ నొప్పి సాధారణంగా గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది. అయితే గుండె జబ్బులు ఉన్న చాలా మంది వ్యక్తులు తేలికపాటి అసౌకర్యాన్ని అనుభవిస్తుంటారు. వారు వాస్తవానికి నొప్పిని వర్ణించలేరు. అటువంటి పరిస్థితిలో గుండెపోటు లేదా ఏదైనా ఇతర గుండె సమస్య కారణంగా ఛాతీ అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ క్రింది లక్షణాలు ఉంటే విస్మరించకండి..
* వికారం లేదా వాంతులు
* చల్లని చెమట
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* గుండె వేగంగా కొట్టుకుంటుంది
* మైకము లేదా బలహీనత
* ఛాతీలో ఒత్తిడి, భారం, దహనం లేదా బిగుతు
* వెన్ను, మెడ, దవడ, భుజాలు, ఒకటి లేదా రెండు చేతులను నలిపివేస్తున్నట్టుగా, కత్తితో పొడిచేస్తున్నట్టుగా నొప్పి
* నొప్పి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. చర్యతో మరింత తీవ్రమవుతుంది, కొంతకాలం తర్వాత వెళ్లి తిరిగి వస్తుంది.
– ఇతర రకాల ఛాతీ నొప్పి..
ఛాతీలో నొప్పి గుండెకు సంబంధించినదా లేక మరేదైనా కారణమా అని చెప్పడం కష్టం. అటువంటి పరిస్థితిలో మీరు దానిని గుర్తించడం ద్వారా నొప్పిని గుర్తించవచ్చు. సాధారణంగా, మీరు ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తే గుండె సమస్య కారణంగా ఛాతీ నొప్పి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
* మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది.
* నొప్పి ఎక్కువ సమయం ఉంటుంది
* మీరు మీ శరీర స్థితిని మార్చినప్పుడు తగ్గిపోవటం గానీ, లేదంటే మరింత తీవ్రంగా గానీ, మారుతుంది.
* పుల్లని రుచి లేదా ఆహారం నోటిలోకి తిరిగి రావడం
* గుండెల్లో మంట క్లాసిక్ లక్షణాలు – రొమ్ము ఎముక వెనుక బాధాకరమైన, మండే అనుభూతి కలుగుతుంది. గుండె లేదా కడుపు సమస్యల వల్ల సంభవించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…