మనిషి తన వయస్సును బట్టి పూర్తిగా నిద్రపోవాలి. మీరు రాత్రిపూట నిద్రపోలేకపోతే ఇబ్బందులు పడతారు. తరువాత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తికి సరైన నిద్రుండాలని వైద్యులు పదేపదే చెబుతుంటారు. నిజానికి మీ వయసు మీ నిద్రను నిర్ణయిస్తుంది. ప్రతి వ్యక్తి తన వయసును బట్టి నిద్ర పోవాల్సి ఉంటుంది. ఇలా చేయకుంటే మానసిక సమస్యలు పెరుగుతాయి. రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులు ఉంటాయి. దీనితో పాటు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు కూడా సంభవించవచ్చు. అయితే ఏ వయస్సు వారు ఎంతసేపు నిద్రించాలో తెలుసుకోండి.
మీకు మంచి నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండాలంటే ముందుగా మీరు మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవాలి. నిద్రలేమి చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వ్యాయామం ద్వారా సరిదిద్దుకోవచ్చు. అన్నింటిలో మొదటిది మీరు మంచి నిద్ర పొందడానికి మీ శరీర గడియారాన్ని సెట్ చేయాలి. ఇది కాకుండా, మీరు నిద్ర, మేల్కొనే సమయాన్ని సెట్ చేయాలని గుర్తుంచుకోండి. మీరు మంచి నిద్రను పొందాలనుకుంటే మొబైల్ మీ దగ్గర ఉంచుకోవద్దు. కథలు చదవడానికి, మంచి పుస్తకాలు చదవడానికి ప్రయత్నించండి. ఇది మీకు నిద్రపోవడానికి సహాయపడుతుంది.
☛ 3 నెలల వరకు పిల్లలు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి.
☛ 4 నుంచి 11 నెలల పిల్లలు రోజుకు 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలి.
☛ 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలు 11 నుంచి 14 గంటల నిద్ర తీసుకోవాలి.
☛ 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటల నిద్ర తీసుకోవాలి.
☛ 6 నుంచి 13 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 11 గంటల పాటు నిద్రించాలి.
☛ 14 నుంచి 17 ఏళ్ల పిల్లలు 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవాలి.
☛ యువత 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.
☛ 65 ఏళ్లు పైబడిన వారు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌చేయండి