Brain Food: చీటికి మాటికి మతిమరుపు వేదిస్తోందా? వీటిని తిన్నారంటే మీ జ్ఞాపకశక్తి అమాంతం..

|

Oct 05, 2022 | 8:51 PM

వయసుతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరిలో మతిమరుపు తలెత్తుతుంది. అందుకు ఉరుకుల పరుగుల జీవనశైలితోపాటు, ఆహార అలవాట్లు ప్రధాన కారణాలు. మెదడు పనితీరును మెరుగు పరచుకోవడానికి రకరకాల చిట్కాలను అనుసరిస్తుంటారు. ఐతే రోజు వారీ ఆహార..

Brain Food: చీటికి మాటికి మతిమరుపు వేదిస్తోందా? వీటిని తిన్నారంటే మీ జ్ఞాపకశక్తి అమాంతం..
Brain Food
Follow us on

వయసుతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరిలో మతిమరుపు తలెత్తుతుంది. అందుకు ఉరుకుల పరుగుల జీవనశైలితోపాటు, ఆహార అలవాట్లు ప్రధాన కారణాలు. మెదడు పనితీరును మెరుగు పరచుకోవడానికి రకరకాల చిట్కాలను అనుసరిస్తుంటారు. ఐతే రోజు వారీ ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..

సరిపడా నీళ్లు తాగాలి
ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నీరు సమృద్ధిగా తాగాలి. నీరు సరిపడా తాగితే ఆరోగ్యంతోపాటు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.

టమాటా
జ్ఞాపకశక్తిని పెంపొందించే గుణం టమాటాలకు ఉంటుంది. వీటిల్లోని ‘లైకోపీన్’ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. టమాటా రోజూ తినేవారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది కూడా.

ఇవి కూడా చదవండి

ఉల్లి
జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడే మరో ఆహార పదార్థం ఉల్లి. దీనిలో ఆంథోసయనిన్, క్వెర్సెటిన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చాలా మందికి ఉల్లిపాయ తినే అలవాటు ఉండదు. ఇటువంటి వారు ఇప్పటి నుంచైనతినడం మంచిది.

బీట్‌రూట్
బీట్‌రూట్ శరీరంలో రక్తం ఉత్పత్తికి మాత్రమేకాకుడా మెదడుకు సరిపడా రక్తాన్ని సరఫరా చేయడంలో కూడా తోడ్పడుతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

గ్రీన్ టీ
జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సహాయపడే వాటిల్లో గ్రీన్ టీ ఒకటి. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా గ్రీన్‌టీ తాగితే మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది

డ్రైఫ్రూట్స్
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష.. వంటి ఆహార పదార్థాలు జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అలాగే ఈ ఆమ్లాలు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిట్టర్స్‌ పనితీరును మెరుగుపరిచి మెదడుకు రక్షణనిస్తాయి. మెదడులోని రక్తనాళాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ని సరఫరా చేయడంలోనూ ఇవి తోడ్పడతాయి. వీటిల్లోని విటమిన్ బి6, మెగ్నీషియం జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఆకుకూరలు
ఆకుకూరలు ఆరోగ్యానికే కాకుండా మెదడు చురుగ్గా పని చేయడంలోనూ సహాయపడతాయి. ఇందులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం ఆలోచనాశక్తిని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పొటాషియంతోపాటు మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఇ, కె వంటి పోషకాలు మెదడుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడతాయి.

పసుపు
మెదడు చురుకుదనాన్ని పెంచే శక్తి పసుపుకి ఉందని పలు అధ్యయనాల్లో బయటపడింది. దీనిలోని కర్క్యుమిన్ అనే పదార్థం అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయ పడుతుంది. గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యంతోపాటు, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

వీటితోపాటు బ్లూబెర్రీలు, యాపిల్స్‌, నిమ్మ, దానిమ్మ, తేనె, డార్క్ చాక్లెట్, గింజలు వంటి ఆహారాలను ప్రతి రోజూ క్రమం తప్పకుండా తింటుంటే జ్ఞాపకశక్తి పెంపొందుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.