Hot Lemon Water: గోరు వెచ్చని నీళ్లలో నిమ్మ రసం కలుపుకుని తాగారంటే..

|

Aug 28, 2022 | 7:03 PM

మీరెప్పుడైనా గోరు వెచ్చని నీళ్లలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగారా? ఇప్పటివరకు తాగకపోతే ఓసారి ట్రై చేయండి. ఎందుకంటే..

Hot Lemon Water: గోరు వెచ్చని నీళ్లలో  నిమ్మ రసం కలుపుకుని తాగారంటే..
Lemon Water
Follow us on

Surprising Benefits of Hot Water and Lemon: నిమ్మరసం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉండచడంతోపాటు, పొట్ట సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. గ్లాస్‌ నిమ్మరసం తాగితే అలసట నుంచి తక్షణ శక్తి లభిస్తుంది. సాధారణంగా నిమ్మరసం తయారు చేసేటప్పుడు సాధారణ నీరు/చల్లని నీటిని కలుపుతారు. చాలా మంది ఈ విధంగా తాగడానికే ఇష్టపడతారు. ఐతే మీరెప్పుడైనా గోరు వెచ్చని నీళ్లలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగారా? ఇప్పటివరకు తాగకపోతే ఓసారి ట్రై చేయండి. మామూలు నీళ్లతో తయారు చేసిన నిమ్మరసం కంటే వేడినీళ్ల నిమ్మరసం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సిట్రస్ పండ్లను తినాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. నిమ్మకాయలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. దీనితోపాటు విటమిన్ బి-6, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వేడి నీళ్ల నిమ్మరసం ఎలా తయారు చేసుకోవాలంటే.. గ్లాసు నీళ్లను ఒక గిన్నెలో తీసుకుని, సగం నిమ్మకాయ ముక్కను అందులో వేసి రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత నిమ్మకాయను నీళ్లలో పిండి నీళ్లలో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. రుచికి కొంచెం తేనెను కూడా జోడించవచ్చు. వడకట్టి గోరువెచ్చగా తాగితే సరి. ఇలా గోరువెచ్చనినిమ్మ రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం..

నిమ్మకాయలో విటమిన్ సి, బితోపాటు భాస్వరం కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ లోపాన్ని నివారిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందుతుంది. నిమ్మకాయలో ఉండే పొటాషియం రక్త నాళాలను శుభ్రపరచడానికి పనిచేస్తుంది. శరీరంలో కొత్త రక్తకణాలు ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది. వేడి నీటిలో నిమ్మ ముక్కను మరిగించి తాగడం వల్ల చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి వేడినీళ్ల నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పొట్టలోని కొవ్వును తగ్గించి, బరువును నియంత్రణలో ఉంచుతుంది.