Health Test for Women: 30 దాటిన మహిళలు తప్పని సరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలి.. వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది

|

Mar 16, 2024 | 10:11 AM

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మహిళలు ఖచ్చితంగా 30 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య పరీక్షలు  చేయించుకోవాలి. శరీరాన్ని పరీక్షించడం ద్వారా మధుమేహం, క్యాన్సర్ ,గుండె జబ్బులతో సహా అనేక  ప్రమాద కర వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇలా పరీక్షలు చేయించుకోవడం వలన ఏదైనా   ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే ఆ వ్యాధి నిర్ములించబడుతుడ్ని. ఈ నేపథ్యంలో 30 దాటిన మహిళలు ఎలాంటి ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

Health Test for Women: 30 దాటిన మహిళలు తప్పని సరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలి.. వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది
Health Test For Women
Image Credit source: pexels
Follow us on

మారిన జీవన విధానంతో కాలంతో పోటీ పడుతూ ఉరుకులు పరుగుల జీవితాన్ని గడపాల్సి వస్తుంది. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ప్రస్తుతం ఎక్కువ మంది తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ముఖ్యంగా పని చేసే మహిళలు తా హీరోగా పనిచేసే మహిళలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి నుంచి ఆఫీస్ వరకు ప్రతిదానికీ బాధ్యత పురుషుల కంటే స్త్రీలపై కొంచెం అధికంగానే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో స్త్రీ తన ఆరోగ్యాన్ని తాను సరిగ్గా చూసుకోలేకపోతుంది. చిన్న చిన్న అజాగ్రత్తలే అనేక పెద్ద ఇబ్బందులను కలిగిస్థాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మహిళలు ఖచ్చితంగా 30 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య పరీక్షలు  చేయించుకోవాలి. శరీరాన్ని పరీక్షించడం ద్వారా మధుమేహం, క్యాన్సర్ ,గుండె జబ్బులతో సహా అనేక  ప్రమాద కర వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇలా పరీక్షలు చేయించుకోవడం వలన ఏదైనా   ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే ఆ వ్యాధి నిర్ములించబడుతుడ్ని. ఈ నేపథ్యంలో 30 దాటిన మహిళలు ఎలాంటి ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

క్యాన్సర్ పరీక్ష :

35 ఏళ్లు వచ్చిన మహిళలు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ పరీక్షలను చేయించుకోవాలి. క్యాన్సర్ మొదటి దశలో  బయటపడదు. కనుక మహిళలు తప్పనిసరిగా BRCA జన్యు పరీక్ష , HPV పరీక్ష చేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

CBC పరీక్ష :

కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే CBC పరీక్ష చేయించుకోవడం కూడా అవసరం. ఈ పరీక్ష సహాయంతో శరీరంలో ఇన్ఫెక్షన్, రక్తహీనత, హిమోగ్లోబిన్ సహా అనేక ఇతర వ్యాధులను గుర్తించవచ్చు.

థైరాయిడ్ పరీక్ష

భారతదేశంలో థైరాయిడ్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మహిళలు 30 సంవత్సరాల వయస్సు దాటిన వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్ లక్షణాలు హార్మోన్లలో మార్పులు, బరువు పెరగడం, క్రమరహిత పీరియడ్స్ వంటి సమస్యలను కలిగి ఉంటాయి.

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష

జంక్ ఫుడ్, జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె జబ్బులు కూడా పెరుగుతున్నాయి.కనుక లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్ష సహాయంతో హైపర్ కొలెస్టెరోలేమియా, హైపర్ కార్డియోమయోపతి వంటి ప్రమాదకరమైన సమస్యలను సకాలంలో గుర్తించవచ్చు.

మధుమేహం

మధుమేహ వ్యాధి కూడా వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో 80 లక్షల మందికి పైగా మహిళలు బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో HbA1c,  రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..