Black Salt: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ తాగండి.. మార్పు మాములుగా ఉండదు

|

Jun 11, 2024 | 1:46 PM

నల్ల ఉప్పు.. మనలో చాలా మందికి దీని గురించి తెలియదు. అయితే ఇటీవల దీని ప్రయోజనాలు తెలిసి ప్రజలు పెద్ద ఎత్తున అలవాటు చేసుకుంటారు. నల్ల ఉప్పును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పరగడుపున బ్లాక్‌ సాల్ట్‌ కలిపిన నీటిని తీసుకోవడం ద్వారా...

Black Salt: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ తాగండి.. మార్పు మాములుగా ఉండదు
Black Salt water
Follow us on

నల్ల ఉప్పు.. మనలో చాలా మందికి దీని గురించి తెలియదు. అయితే ఇటీవల దీని ప్రయోజనాలు తెలిసి ప్రజలు పెద్ద ఎత్తున అలవాటు చేసుకుంటారు. నల్ల ఉప్పును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పరగడుపున బ్లాక్‌ సాల్ట్‌ కలిపిన నీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇంతకీ ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయ కణాలలో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇది కాలేయం పనితీరును కూడా వేగవంతం చేస్తుంది. ఇది అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.

* నల్ల ఉప్పు కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో మురికి మొత్తం తొలగిపోతుంది. ఇది శరీరంలో లేదా సిరల్లో అంటుకున్న మురికిని బయటకు పంపుతుంది. శరీరంలో మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సొంతమవుతుంది.

* జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బ్లాక్‌ సాల్ట్‌ వాటర్‌ ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని మెరిసేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

* మల బద్ధకం సమస్యతో బాధపడేవారు నల్ల ఉప్పును నీటిలో కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పొట్టను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా పైల్స్ సమస్య నుంచి కూడా శాశ్వతంగా ఉపశమనం లభిస్తుంది.

* బ్లాక్‌ సాల్ట్‌లో నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

* ఎముకలు దృఢంగా మారుతాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఈ డ్రింక్‌ ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బ్లాక్ సాల్ట్‌ వాటర్‌ ఉపయోగపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..