Diabetes Diet: షుగర్ పేషెంట్లు ప్రతి రోజూ ఈ పండు తిన్నారంటే..

|

Jul 14, 2022 | 5:42 PM

ఋతువులు మారే కొద్దీ ఆయా కాలాల్లో అమృత ఫలాలను అందిస్తుంది ప్రకృతి. ఈ పండ్లన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో ఖచ్చితంగా తినాలని పెద్దలు చెబుతుంటారు. వర్షాకాలంలో దొరికే..

Diabetes Diet: షుగర్ పేషెంట్లు ప్రతి రోజూ ఈ పండు తిన్నారంటే..
Pears
Follow us on

health benefits of eating pears regularly: ఋతువులు మారే కొద్దీ ఆయా కాలాల్లో అమృత ఫలాలను అందిస్తుంది ప్రకృతి. ఈ పండ్లన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో ఖచ్చితంగా తినాలని పెద్దలు చెబుతుంటారు. వర్షాకాలంలో పనస, పైనాపిల్‌, బేరీ వంటి అనేక రకాల పండ్లు మార్కెట్లో దర్శనమిస్తాయి. వీటిల్లో బేరిపండ్లు ప్రత్యేకమైనవి. ఎందుకంటే వీటిల్లో ఫోలేట్, విటమిన్ సి, కాపర్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు రుచికి తియ్యగా ఉంటుంది. దీనిలోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే వర్షాకాలంలో రోజుకో పియర్ (బేరీ పండు) తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. కొలెస్ట్రాల్ నుంచి మలబద్ధకం వరకు, అలాగే క్యాన్సర్ నుంచి గుండెపోటు వరకు దివ్యౌషధంగా ఈ పండు ఉపయోగపడుతుంది. ఐతే చెట్టు నుంచి వేరుచేసిన తర్వాత కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ఈ పండు తినాలి. లేదంటే కుళ్లిపోతుంది. పోషకాహార నిపుణుడు లవ్‌నీత్ బాత్రా ప్రకారం.. ఈ పండు అందించే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..

బేరి పండులో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. పెక్టిన్ అనేది ఒక రకమైన ఫైబర్. ఇది LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహం, ఫ్యాటీ లివర్‌తో సంభవించే సమస్యలకు ఈ పండు చక్కని పరిష్కారం.

Pear Fruits

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే యాంటీ డయాబెటిక్ గుణాలు బేరిపండులో అధికంగా ఉంటాయి. షుగర్ పేషెంట్లలో ప్రతిరోజూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే పియర్‌ ఫ్రూట్‌ తప్పనిసరిగా తినాలి.

ఇవి కూడా చదవండి

ఓ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ పియర్స్ తినడం వల్ల మూత్రాశయం, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని నిరూపితమైంది. బేరిలోని ఉర్సోలిక్ యాసిడ్, ఆరోమాటేస్ చర్యను నిరోధిస్తుంది. తద్వారా క్యాన్సర్‌ను కణాలను నాశనం చేస్తుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్‌..! కాబట్టి బేరి పండును తక్కువగా అంచనా వేయకుండా తినండి.. ఆరోగ్యంగా ఉండండి..