మార్నింగ్ వాక్‍తో కలిగే ఈ నమ్మశక్యం కాని ప్రయోజనాలు తెలుసా?

| Edited By:

Mar 15, 2019 | 7:38 PM

వ్యాయామం చేయడం కుదరకపోతే సరే ఈరోజు కుదరలేదని ఓ కుంటి సాకు చెప్పి తప్పించుకుంటారు. కానీ, అలా చేయడం మంచిది కాదు.. వ్యాయమం చేయడం కుదరకపోతే నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాకింగ్ చేయడం ఎంతో లాభదాయకం. ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగకరమైనది. ఉదయం నిద్రలేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుని నడక ప్రారంభించడం ఉత్తమం. ఎందుకంటే ఉదయంపూట స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. సూర్యోదయ కిరణాలు శరీరానికి తగులుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. […]

మార్నింగ్ వాక్‍తో కలిగే ఈ నమ్మశక్యం కాని ప్రయోజనాలు తెలుసా?
Follow us on

వ్యాయామం చేయడం కుదరకపోతే సరే ఈరోజు కుదరలేదని ఓ కుంటి సాకు చెప్పి తప్పించుకుంటారు. కానీ, అలా చేయడం మంచిది కాదు.. వ్యాయమం చేయడం కుదరకపోతే నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాకింగ్ చేయడం ఎంతో లాభదాయకం. ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగకరమైనది. ఉదయం నిద్రలేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుని నడక ప్రారంభించడం ఉత్తమం. ఎందుకంటే ఉదయంపూట స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. సూర్యోదయ కిరణాలు శరీరానికి తగులుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది.

ప్రతి రోజు క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తుంటే శరీరంలోని కండరాలు బలిష్టంగా తయారవుతాయి. శరీరంలో ఉండే పనికిరాని కొవ్వు కరిగిపోతుంది. ఎంత ఎక్కువగా నడక సాగిస్తుంటే అంత ఎక్కువగా శరీరంలోని క్యాలరీలు కరిగి, ఊబకాయం తగ్గుతుంది. ప్రాతఃకాలంలో వచ్చే స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లో రక్తాన్ని శుభ్రపరిచేందుకు దోహదపడుతుంది.

మార్నింగ్ వాక్ చేయడం వలన శారీరక, మానసిక‌పరమైన ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి రోజు కనీసం మూడు కిలోమీటర్ల మేరకు నడవాలి. వారానికి ఐదు రోజులపాటు ఖచ్చితంగా నడిస్తే మంచిది. వాకింగ్ చేసే సమయంలో సౌకర్యవంతమైన చెప్పులు ధరించడం మంచిది. చుట్టూ తోట, ఉద్యానవనం లేదా ఖాళీ స్థలం ఉన్న ప్రాంతాల్లో నడిచేందుకు ప్రయత్నించాలి.

గుండె జబ్బులున్నవారు, రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు లేదా ఇతర జబ్బులతో సతమతమౌతున్నవారు వాకింగ్ చేయాలంటే వైద్యుల సలహా తీసుకోవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తి తమ తమ వయసుకు తగ్గట్టు, వారి సామర్థ్యం మేరకు నడవాల్సివుంటుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం మంచిది. ఆధునిక జీవనశైలితో అస్తవ్యస్తమైన‌ జీవితంలో కనీసం 30 నిమిషాలు ఆరోగ్యం కోసం కేటాయించుకోవాలి.