
100 గ్రాముల మొలకెత్తిన నల్లశనగలలో 20.5 గ్రాముల ప్రోటీన్, 12.2 గ్రాముల ఫైబర్, 57 మి.గ్రా కాల్షియం ఉంటాయి. నల్లశనగలలో 4.31 mg ఇనుము, 718 mg పొటాషియం లభిస్తాయి. మొలకెత్తిన శనగలను రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె ఆరోగ్యానికి మంచిది.
మొలకెత్తిన పెసలలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పెసర మొలకలలో 23.9 గ్రాముల ప్రోటీన్, 16.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పెసర మొలకలు 132 mg కాల్షియం, 6.74 mg ఇనుము, 1250 mg పొటాషియం, 4.8 mg విటమిన్ సి కలిగి ఉంటాయి.
మొలకెత్తిన పెసలు బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇక మొలకెత్తిన పెసలు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో మొలకెత్తిన పెసలు సహాయపడుతాయి.
మొలకెత్తిన పెసలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తపోటు, రోగనిరోధక పనితీరును కూడా నియంత్రిస్తుంది. అయితే, పోషక విలువల పరంగా, పెసర మొలకలు శనగల కంటే మెరుగైనవి అంటున్నారు నిపుణులు. అయితే, పూర్తి పోషకాహారం పొందడానికి, రెండింటినీ కలిపి తినడం ఉత్తమం అంటున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..