అరటిపండు వలన ఆరోగ్య లాభాలు

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:09 PM

అరటిపండు తక్షణ శక్తిని అందించటమే కాకుండా, శక్తి స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఒక అరటిపండు నుండి వచ్చే శక్తి ద్వారా నిరంతరంగా 90 నిమిషాల పాటూ కఠినమైన వ్యాయామాలను చేయవచ్చని పరిశోధనలలో వెల్లడించారు. ఇవే కాదు అరటి పండు తినటం వలన కలిగే మరిన్ని లాభాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఏకైక ఉష్ణమండల పండుగా పేర్కొనబడే అరటిపండు (బనానా) అధికంగా పొటాషియం, ఉప్పును తక్కువగా కలిగి ఉండి, రక్తపోటుకు సరైన ఔషదంగా పేర్కొనవచ్చు. స్ట్రోక్ మరియు రక్తపోటును […]

అరటిపండు వలన ఆరోగ్య లాభాలు
Follow us on

అరటిపండు తక్షణ శక్తిని అందించటమే కాకుండా, శక్తి స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఒక అరటిపండు నుండి వచ్చే శక్తి ద్వారా నిరంతరంగా 90 నిమిషాల పాటూ కఠినమైన వ్యాయామాలను చేయవచ్చని పరిశోధనలలో వెల్లడించారు. ఇవే కాదు అరటి పండు తినటం వలన కలిగే మరిన్ని లాభాల గురించి ఇక్కడ తెలుపబడింది.

ఏకైక ఉష్ణమండల పండుగా పేర్కొనబడే అరటిపండు (బనానా) అధికంగా పొటాషియం, ఉప్పును తక్కువగా కలిగి ఉండి, రక్తపోటుకు సరైన ఔషదంగా పేర్కొనవచ్చు. స్ట్రోక్ మరియు రక్తపోటును ఆరోగ్యకర నిర్వహిస్తుందన్న కారణం చేత అరటిపండు పరిశ్రమలు కొనసాగించాలని “యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్” వారు అధికారిక వాదనలను చేయటానికి సిద్దమయ్యారు.

యూకే లోని ఒక స్కూల్ లో 200 మంది విద్యార్ధులకు పరీక్ష సమయంలో వారి మెదడు యొక్క శక్తి మరియు సామర్థ్యాన్ని పెంచుటకు గానూ సంవత్సరం పొడవునా ఉదయాన అల్పాహారంగా మరియు మధ్యాహ్న‌ భోజనం తరువాత అరటిపండును ఇచ్చారు. పొటాషియంను అధికంగా కలిగి ఉండే ఈ పండు నేర్చుకోవటంపై ఆసక్తిని పెంచుతుందని పరిశోధనలలో వెల్లడించబడింది.

ఫైబర్ ను అధికంగా కలిగి ఉండే అరటిపండును రోజు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవటం వలన జీర్ణవ్యవస్థలోని పేగు కదలికలు సరిగా జరపబడి, మలబద్దకానికి దూరంగా ఉంచుతుందని అధ్యయనాలలో పేర్కొనబడింది. కావున మలబద్దకం సమస్యను కలిగి ఉండే వారు రోజు ఒక అరటిపండు తప్పక తినాలి.

హ్యాంగ్ఓవర్ సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే అందుబాటులో ఉన్న మంచి మార్గం తేనె కలిపిన బనానా మిల్క్ షేక్. అరటిపండు జీర్ణాశయాన్ని శాంతి పరుస్తుంది, తేనె క్షీణించిన చక్కెర స్థాయిలను తిరిగి నిర్మిస్తుంది.