Headache Relief Tips: ఈ సింపుల్ చిట్కాలతో తలనొప్పిని మాయం చేయవచ్చు..

|

Oct 12, 2024 | 3:59 PM

తలనొప్పి వచ్చిందంటే.. ఒక పట్టాన ఎక్కడా కూర్చోలేం.. ఉండలేం. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సరైన నిద్ర లేకపోవడం, నీళ్లు తాగడకపోవడం, ఫోన్స్ ఎక్కువగా చూడటం, ఆహారం తినకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాలతో పాటు హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పిగా ఉంటే ఏ పనీ చేయలేం. ఇంట్లో ఉండే వాళ్ల సంగతి పక్కన పెడితే..

Headache Relief Tips: ఈ సింపుల్ చిట్కాలతో తలనొప్పిని మాయం చేయవచ్చు..
Headache
Follow us on

తలనొప్పి వచ్చిందంటే.. ఒక పట్టాన ఎక్కడా కూర్చోలేం.. ఉండలేం. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సరైన నిద్ర లేకపోవడం, నీళ్లు తాగడకపోవడం, ఫోన్స్ ఎక్కువగా చూడటం, ఆహారం తినకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాలతో పాటు హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పిగా ఉంటే ఏ పనీ చేయలేం. ఇంట్లో ఉండే వాళ్ల సంగతి పక్కన పెడితే.. బయట ఉద్యోగాలు చేసేవారికి చాలా కష్టంగా ఉంటుంది. దీంతో ఓ ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేసుకుంటారు. ఇలా ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకోడం వల్ల భ్యవిష్యత్తులో నష్టాలు తప్పవు. కానీ కొన్ని రకాల చిట్కాలతో మనం తల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

నీటిని తాగండి:

డీహైడ్రేషన్ కారణంగా కూడా తలనొప్పి అనేది వస్తుంది. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు నీటిని ఎక్కువగా తీసుకోండి. నీటిని తాగడం వల్ల కొద్ది సేపటికి తలనొప్పి తగ్గుతుంది. ఆ తర్వాత లెమన్ టీ, అల్లం టీ వంటివి తాగడం వల్ల తలలో ఉండే రక్త నాళాల వాపును అనేది తగ్గించడానికి, వికారాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి.

తలను మసాజ్ చేసుకోండి:

తల నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే తలపై మర్దనా చేసుకోవాలి. బాగా టైట్‌గా జడ వేసినా కూడా తలపై ఉండే వెంట్రుకలు పట్టేసి.. తలనొప్పిగా అనిపిస్తుంది. కాబట్టి జడను లూజ్‌గా వేసుకోవాలి. తలనొప్పిగా ఉన్నప్పుడు కాస్త ఆయిల్ తీసుకుని తలపై వేళ్లతో మెళ్లిగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే తలపై రక్త ప్రసరణ బాగా జరిగి.. తలనొప్పి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఉప్పు వాటర్:

ప్రస్తుత కాలంలో చాలా మంది వంటల్లో సాల్ట్ ఉపయోగిస్తున్నారు. కానీ వీటి కంటే రాళ్ల ఉప్పు ఉపయోగిస్తే చాలా మంచిది. తల నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు రాళ్ల ఉప్పును కొద్దిగా గోరు వెచ్చటి నీటిలో కలిపి తాగండి. ఇలా చేయడం వల్ల కూడా తల నొప్పి తగ్గుతుంది.

కోల్డ్ ప్యాక్:

కొన్ని సార్లు వేడి కారణంగా కూడా తలనొప్పి అనేది వస్తుంది. కాబట్టి తలనొప్పిగా ఉన్నప్పుడు నుదుటిపై కోల్డ్ ప్యాక్‌ను అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. పది నిమిషాల వరకు ఇలానే ఉంచండి. ఇలా చేయడం వల్ల తల తిరగడం, వికారం కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..