Itching Palms: అరి చేతులు దురద పెడితే ఆర్థిక లాభం కాదు.. అనారోగ్యమే!

అప్పుడప్పుడు అరి చేతుల్లో, పాదాల్లో దురద వస్తూ ఉంటుంది. చాలా మందికి ఇలా జరిగే ఉంటుంది. అరి చేతులు దురద పెడుతుందని అంటే.. ఇంట్లో పెద్దలు మాత్రం ఆర్థిక లాభం అని చెబుతూ ఉంటారు. కానీ అస్సలు కానేకాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరి చేతులు, పాదాల్లో దురద పెడితే చర్మ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారని అర్థమట. ఇది తీవ్రమైన వ్యాధిగా కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఇంతకీ అరి చేతుల్లో, పాదాల్లో దురదలు..

Itching Palms: అరి చేతులు దురద పెడితే ఆర్థిక లాభం కాదు.. అనారోగ్యమే!
Itch Hands

Updated on: Feb 05, 2024 | 3:12 PM

అప్పుడప్పుడు అరి చేతుల్లో, పాదాల్లో దురద వస్తూ ఉంటుంది. చాలా మందికి ఇలా జరిగే ఉంటుంది. అరి చేతులు దురద పెడుతుందని అంటే.. ఇంట్లో పెద్దలు మాత్రం ఆర్థిక లాభం అని చెబుతూ ఉంటారు. కానీ అస్సలు కానేకాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరి చేతులు, పాదాల్లో దురద పెడితే చర్మ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారని అర్థమట. ఇది తీవ్రమైన వ్యాధిగా కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఇంతకీ అరి చేతుల్లో, పాదాల్లో దురదలు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సోరియాసిస్:

సోరియాసిస్ కారణంగా కూడా అరి చేతులు, పాదాల్లో దురదలు వస్తాయని నిపుణులు అంటున్నారు. సోరియాసిస్ అనేది స్కిన్ అలెర్జీ, చర్మంపై తెల్లని పొలుసులు వంటివి ఏర్పడి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా సోరియాసిస్ వచ్చే ముందు కూడా దురద వంటివి వస్తాయి. కాబట్టి మీ చర్మాన్ని కాస్త గమనిస్తూ ఉండండి.

డ్రై స్కిన్:

పొడిబారిన చర్మం ఉన్నా కూడా ఇలా దురదలు, మంట వస్తాయట. మీ చర్మం నిర్జీవంగా ఉండి.. పొడి బారి పోయినట్లయితే.. హైడ్రేషన్ అనేది సరిగ్గా అందడం లేదని గుర్తించండి. వెంటనే తగినంత నీరు, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

అలెర్జీ:

అలెర్జీ వల్ల కూడా దురదలు అనేవి రావచ్చు. ఒక్కోసారి కొన్ని రకాల వస్తువులు, పదార్థాలు తాకినా.. తిన్నా కూడా అలెర్జీ వచ్చి దురద వస్తుంది. కాబ్టటి మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో.. ఒకసారి గమనించుకోండి. అలాగే కొంత మందికి కొన్ని రకాల దుస్తులు పడవు. అప్పుడు కూడా దురద అనేది రావచ్చు.

మధుమేహం:

మధుమేహం వచ్చే ముందు కూడా దురద వంటికి వస్తాయి. ఇది కూడా డయాబెటీస్ రావడానికి ఒక లక్షణంగా వైద్యులు చెబుతారు. కాబట్టి అరి చేతులు, పాదాల్లో దురదగా ఉంటే.. వెంటనే ఒకసారి గమనించండి. అవసరం అనుకుంటే టెస్టులు అయినా చేయించుకోవడం బెటర్.

తామర:

తామర వచ్చే ముందు కూడా అరి చేతులు, పాదాల్లో దురదలు వస్తూ ఉంటాయి. ఎర్రటి మచ్చలు.. ఎక్కువగా మంట, దురద వస్తే తామర వస్తోందని గుర్తించాలి.

పైన చెప్పిన లక్షణాల్లో ఏది అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు. ఎందుకంటే మొదట్లోనే గుర్తిస్తే.. త్వరగా నయం అయిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.