Hair Oil Benefits: తలకు నూనె రాయడం మానేశారా..? అయితే, జరిగేది తెలిస్తే దెబ్బకు..

మీ జుట్టుకు నూనె రాయడం మానేస్తే, స్కాల్ప్ పొడిబారి చుండ్రు వస్తుంది. జుట్టు సహజ తేమను కోల్పోయి, నిర్జీవంగా, రఫ్‌గా మారుతుంది. ఇది జుట్టు రాలడానికి, స్ప్లిట్ ఎండ్స్‌కి దారితీస్తుంది. నూనె మీ జుట్టును దుమ్ము, ఎండ నుండి రక్షిస్తుంది, కాబట్టి పోషణ కోసం క్రమం తప్పకుండా నూనె రాయడం ముఖ్యం.

Hair Oil Benefits: తలకు నూనె రాయడం మానేశారా..? అయితే, జరిగేది తెలిస్తే దెబ్బకు..
Hair

Updated on: Dec 23, 2025 | 7:14 PM

మీరు మీ జుట్టుకు నూనె రాయడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఒక నెల పాటు మీ జుట్టుకు నూనె రాయకపోతే..ఆ తేడా వెంటనే తెలియకపోవచ్చు.. కానీ, కొద్ది రోజుల్లోనే మీరు ఆ తేడాను గమనిస్తారు. తలకు నూనె అప్లై చేయడం అనేది జిడ్డుగా ఉంచడం కాదు.. జుట్టును అందంగా చేస్తుంది. దానిని రక్షిస్తుంది కూడా. ఇది దుమ్ము, ఎండ, వేడి, నీటి హానికరమైన కాఠిన్యం నుండి కూడా రక్షించే పొరను సృష్టిస్తుంది. ఈ పొరను తొలగించినప్పుడు, జుట్టు సమస్యలు మొదలవుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

తలకు నూనె రాసుకోకపోవడం వల్ల స్కాల్ప్‌ మీద సహజ తేమ తగ్గుతుంది. దీంతో జుట్టు పొడిగా మారుతుంది. తలకు నూనె రాసుకోకపోతే జుట్టు అస్సలు బాగోదు. రఫ్‌గా మారుతుంది. దీంతో జుట్టును స్టైల్‌ను చేయడం చాలా కష్టం. తలకు నూనె రాసుకోకపోవడం వల్ల స్కాల్ప్‌ మీద తేమ ఉండదు. పొడిగా మారుతుంది. దీని వల్ల చుండ్రు వస్తుంది. తలకు నూనె రాసుకోకపోతే కురులకు పోషణ అందదు. సరైన పోషణ లేకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు పెరగదు. తలకు నూనె రాసుకుని కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల మనకు విటమిన్ డి కూడా అందుతుంది.

తలకు నూనె రాసుకోకపోతే స్కాల్ప్‌కు బ్లడ్ సర్కులేషన్ సరిగా ఉండదు. దీని వల్ల జుట్టు మూలాలు దెబ్బతింటాయి. జుట్టులో స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా నూనె రాసుకోవాలి. తలకు నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు షైనీ తగ్గుతుంది. హెయిర్ లుక్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. నల్లని జుట్టు కోసం తలకు నూనె రాసుకోండి. తలకు నూనె రాసుకోకపోతే తల మరింత స్టిక్కీగా మారుతుంది. కురులు అస్సలు బాగోవు. తలకు నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు రఫ్‌గా ఉంటుంది. సిల్కీగా ఉండదు. జీవం లేనట్టు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ నూనె రాయడం అవసరం లేదు. కానీ దానిని పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదు. తేలికైన నూనెలను వాడటం లేదా వారానికి ఒకటి లేదా రెండుసార్లు రాయడం చేయాలి.