AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి!

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య జుట్టు రాలడం, చుండ్రు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి అవిసె గింజలు ఎంతగానో సహాయపడతాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు తగిన పోషణనిచ్చి, జుట్టును బలంగా, ఒత్తుగా మారుస్తాయి. ఇంట్లోనే సులభంగా అవిసె గింజల జెల్ తయారు చేసి, క్రమం తప్పకుం వాడుతూ ఉంటే.. జుట్టు రాలడం తగ్గి, సిల్కీగా, ఆరోగ్యంగా మెరుస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి!
Flaxseed Hair Mask
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2026 | 7:35 PM

Share

ప్రతి ఒక్కరూ ఒత్తైన, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ, మారుతున్న జీవనశైలి, కాలుష్యం, పోషకాహార లోపం, రసాయనాలతో కూడిన షాంపూల వాడకం వల్ల జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. బ్యూటీ పార్లర్లలో ఖరీదైన ట్రీట్‌మెంట్లు చేయించుకునే బదులు, మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో జుట్టును సంరక్షించుకోవడం చాలా ఉత్తమం. అలాంటి వాటిలో అవిసె గింజలు ముందుంటాయి. అవిసె గింజలతో ఇంట్లోనే సులభంగా హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అవిసె గింజలు జుట్టుకు ఎందుకు మేలు చేస్తాయి?

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్‌కు రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి. అంతేకాకుండా, జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు మొలకెత్తడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి.

అవిసె గింజల హెయిర్ మాస్క్ తయారీ విధానం:

ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడం చాలా సులభం. దీనికోసం క్రింది దశలను అనుసరించండి. అవిసె గింజల జెల్ తయారీ కోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీరు పోసి, అందులో 3-4 స్పూన్ల అవిసె గింజలు, 8-10 తాజా కరివేపాకు ఆకులు, 4-5 తాజా మందార ఆకులు, వాటిని సుమారు 5 నుండి 7 నిమిషాల పాటు మరిగించండి. నీరు చిక్కటి జెల్ రూపంలోకి మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడే గుడ్డ లేదా స్ట్రైనర్ సహాయంతో జెల్‌ను వేరు చేయాలి. ఇలా తయారైన ఈ అవిసె గింజల జెల్‌లో ఒక స్పూన్ కలబంద గుజ్జు లేదా కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ కలపాలి. ఇది జుట్టుకు అదనపు మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉపయోగించే విధానం:

ఈ మిశ్రమాన్ని తల కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి. సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి కనీసం ఒకసారైనా ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవిసె గింజల హెయిర్ మాస్క్ వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా, జుట్టు సిల్కీగా, మృదువుగా,మెరిసేలా మారుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నేచురల్ రెమెడీని ట్రై చేసి మీ జుట్టును అందంగా మార్చుకోండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..