నెరిసిన జుట్టు, జుట్టు రాలడం ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తినే ఆహారం, అనుసరించే జీవనశైలి ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొంతమంది తమ గ్రే హెయిర్ సమస్యను దాచుకోవడానికి రంగులు వేసుకుంటారు. దీనివల్ల సమస్యకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. కానీ, దాని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అదే కారణంతో కొందరు తెల్లజుట్టు కనిపిస్తే పట్టించుకోకుండా రసాయన రంగులకు దూరంగా ఉంటారు. కానీ నల్ల నువ్వులు జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి, చుండ్రు సమస్యను తొలగించడానికి, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నల్ల నువ్వులు జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించడమే కాకుండా ఎటువంటి దుష్ప్రభావాలకు దారితీయవు.
నల్ల నువ్వులు పోషకాల గని:
నల్ల నువ్వులను సాధారణంగా వంటలలో ఉపయోగిస్తారు. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల తెల్లజుట్టు మళ్లీ నల్లగా మారుతుందని చాలా మందికి తెలియదు. నల్ల నువ్వులలో ఒమేగా-3, 6 వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు శరీరంలోని కొల్లాజెన్‌ను పెంచుతాయి. ఇది రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు మూలాలకు పోషణను అందిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.
జుట్టుకు నల్ల నువ్వులను ఎలా అప్లై చేయాలి? :
నల్ల నువ్వులను ఎండబెట్టిన తర్వాత రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ రసం, కలబంద వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో జుట్టును కడగాలి. ఇలా నెలకు మూడు నాలుగు సార్లు చేస్తే క్రమంగా తెల్లజుట్టు తగ్గుతుంది.
నల్ల నువ్వులు జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది? :
నల్ల నువ్వుల ముద్దను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు జుట్టులో ఇన్ఫెక్షన్ సమస్య కూడా తొలగిపోతుంది.
చుండ్రు నుంచి ఉపశమనం:
చలికాలంలో జుట్టులో చుండ్రు సర్వసాధారణం. తలలో తేమ లేకపోవడమే దీనికి కారణం. హెయిర్ పేస్ట్ కోసం ఉపయోగించే నల్ల నువ్వులు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. జుట్టుకు అప్లై చేయడం వల్ల తలకు పోషణ లభిస్తుంది. చుండ్రును తొలగిస్తుంది.
జుట్టుకు మెరుపునిస్తుంది:
నల్ల నువ్వులలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టును మెరుగుపరుస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. ఈ పేస్ట్ జుట్టు చిట్లడం సమస్యను నయం చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి