గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఒక్క గ్లాస్ తాగితే కొండైనా కరగాల్సిందే.. కొవ్వును కోసి..

అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. చాలా మంది అధిక బరువుతోపాటు.. హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది శరీరంలో మైనపు లాంటి జిగట పదార్థం. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ కనిపిస్తుంది. మంచి.. చెడు కొలెస్ట్రాల్..

గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఒక్క గ్లాస్ తాగితే కొండైనా కరగాల్సిందే.. కొవ్వును కోసి..
Ginger Water

Updated on: Jul 24, 2025 | 1:00 PM

అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. చాలా మంది అధిక బరువుతోపాటు.. హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది శరీరంలో మైనపు లాంటి జిగట పదార్థం. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ కనిపిస్తుంది. మంచి.. చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ ను HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) అని.. చెడు కొలెస్ట్రాల్‌ను LDL అంటారు.. చెడు కొలెస్ట్రాల్ LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) శరీరానికి ప్రమాదకరం.. ముఖ్యంగా సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.. దీని కారణంగా ధమనులు మూసుకుపోతాయి.. అటువంటి పరిస్థితిలో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, మీరు ఈ పానీయాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు.. దీనిద్వారా కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు.. అదేంటో కాదు.. మన వంటింట్లో ఉండే అల్లం.. మన వంటింట్లో ఉండే అల్లంతో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడంతోపాటు.. బరువు తగ్గవచ్చని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారని.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మీరు ఈ నీటిని మీ ఆహారంలో తీసుకోవచ్చు.

అల్లం..

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మీరు అల్లం తినవచ్చు.. లేదా అల్లంతో చేసిన నీరు, రసం తాగవచ్చు.. అల్లంలో జింజెరాల్ ఉంటుంది.. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అల్లం తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రోజూ అల్లం తినడం వల్ల శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అదే సమయంలో, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గింస్తుంది.. క్రమంగా బరువు కూడా తగ్గుతుంది.

అల్లం ఎలా తీసుకోవాలి..

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, మీరు అల్లం నీటిని తాగవచ్చు. అల్లం నీటిని తయారు చేయడానికి, ఒక పాన్‌లో ఒక గ్లాసు నీటిని వేడి చేయండి. ఇప్పుడు దానికి అల్లం వేసి మరిగించండి. దీని తర్వాత, ఈ నీటిని తాగండి. మీరు ఖాళీ కడుపుతో కూడా ఈ నీటిని తాగవచ్చు. ఇంకా రుచి కోసం నిమ్మరసం కూడా కలుపుకుని తాగవచ్చు.. ఈ డ్రింక్ ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది.

వైద్యుల సలహా ఏంటంటే..

అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగులు తమ ఆహారంలో ఏదైనా చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. మీ వైద్యుడిని సంప్రదించకుండా అల్లం నీటిని తాగవద్దని.. పేర్కొంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..