
బాలీవుడ్ బాద్ షా ముద్దుల సతీమణి గౌరీ ఖాన్ పేరు మనవారికి అంత సుపరిచితం కాకపోవచ్చు. కానీ బాలీవుడ్ లో తన భర్తను స్టేటస్ ను కాదని తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకుందామె. ఇప్పుడు ఈవిడ గురించి ఎందుకు అనుకుంటున్నారా.. ఇప్పుడీ లేడీ బాస్ కన్ను హైదరాబాద్ మీద పడింది. తాజాగా ఆమె నగరంలో తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. గౌరీ ఖాన్ డిజైన్స్ పేరుతో ఆమె తన ఇంటీరియర్ స్టోర్ ను ప్రారంభించింది. జూబ్లిహిల్స్‌లో జరిగిన ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో తారలు సందడి చేశారు.
తాజాగా జరిగిన స్టోర్ లాంచింగ్ ఈవెంట్ కోసం బాలీవుడ్ సెలబ్స్ కు గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసింది. చార్ కోల్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. ఈ ఈవెంట్ లో మాజీ దంపతులు హృతిక్ రోషన్, సుసాన్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇప్పటికే ఈ రంగంలో ప్రత్యేక ముద్ర వేసిన గౌరీ ఖాన్ ముంబైలోని పలువురు సెలబ్రిటీ ఇళ్లను కూడా సొంతంగా డిజైన్ చేసింది. అలియా భట్, కరణ్ జోహార్, మలైకా అరోరా, అనన్యా పాండే వంటి వారి ఇళ్లకు గౌరీ ఖాన్ ఇంటీరియర్ ను అలంకరించింది. తన బిజినెస్ ను హైదరాబాద్ కు విస్తరించే పనిలో ప్రస్తుతం బిజీగా ఉంది.
సుసాన్ ఖాన్ కూడా చార్ కోల్ ప్రాజెక్ట్ తరఫున ఇందులో భాగస్వామిగా ఉంది. వీరితో పాటు గౌరీ ఖాన్ గర్ల్ గ్యాంగ్ అయిన మహీప్ కపూర్, సీమా సజ్దే, నీలం కొఠారి మరియు భావన పాండే కూడా ఈ కార్యక్రమంలో మెరిశారు. జోయా అక్తర్, డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్, స్టైలిస్ట్ అనితా ష్రాఫ్ అడజానియాకి కూడా ఇందుకు ఆహ్వానం అందింది. మొత్తానికి బాలీవుడ్ బిగ్ సెలబ్స్ అంతా హాజరై గౌరీ ఖాన్ స్టోర్ కి బిగ్ బజ్ ని క్రియేట్ చేశారు. మరి ఇప్పటికే ప్రొడ్యూసర్ గా, రచయితగా, ఇంటీరియర్ డిజైనర్ గా పేరున్న ఈ స్టార్ లేడీ నగరంలో కూడా తన బ్రాండ్‌తో హల్ చల్ చేస్తుందో లేదో చూడాలి. ఇక ఈ ఈవెంట్ లో అంతా బ్లాక్ కలర్ అటైర్ తో ఆకట్టుకున్నారు. వారి మధ్య బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో గౌరీ మెరిసింది. ఈ స్టోర్ సక్సెస్ ను కోరుకుంటూ పలువురు తారలు సోషల్ మీడియాలో గౌరీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ పోస్టులు పెట్టారు. అంచెలంచెలుగా ఆమె ఎదుగుతున్న తీరును ప్రశంసిస్తున్నారు.