Fruit Juice: ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలంటే వీటిని తీసుకోండి చాలు.. ఆరోగ్యంతోపాటు..

|

May 30, 2022 | 4:43 PM

పండ్లు వేసవి నుంచి ఉపశమనం కల్పించడంతోపాటు శరీరాన్ని హైడ్రేట్ గా, ఎనర్జిటిక్ గా ఉండేందుకు సహకరిస్తాయి.

Fruit Juice: ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలంటే వీటిని తీసుకోండి చాలు.. ఆరోగ్యంతోపాటు..
Plastic straw ban in India
Follow us on

Fruit juices to stay hydrated: వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఎక్కువ నీరు తాగాలి. శరీరాన్ని చల్లబరచడానికి చాలా రకాల హెల్తీ డ్రింక్స్ తీసుకుంటుంటారు. ఇందులో పండ్ల రసాలు కూడా ఉంటాయి. పండ్లు వేసవి నుంచి ఉపశమనం కల్పించడంతోపాటు శరీరాన్ని హైడ్రేట్ గా, ఎనర్జిటిక్ గా ఉండేందుకు సహకరిస్తాయి. అయితే.. ప్యాక్ చేసిన జ్యూస్‌లు, శీతల పానీయాలకు బదులుగా పండ్ల రసాలను స్వయంగా చేసుకోని తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. వేసవిలో మీరు ఎలాంటి పండ్ల రసాలను తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి: మామిడిని వేసవిలో ఎక్కువగా తీసుకుంటుంటారు. మామిడిని పండ్లలో రారాజు అంటారు. ఈ సీజన్‌లో మామిడికాయలు బాగా దొరుకుతాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మీరు మామిడిని అనేక రకాలుగా తినవచ్చు. తినడంతోపాటు జ్యూస్‌గా తాగవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైనది అలాగే రుచికరమైనది. ఇది శరీరాన్ని చల్లబరచడంతోపాటు వేడి నుంచి రక్షిస్తుంది. ఇది మీ అలసటను తొలగించడంలో సహాయపడుతుంది.

చెరకు రసం: వేసవి కాలంలో ఒక గ్లాసు చెరుకు రసం మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. చెరకు రసం శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వేసవిలో హీట్ స్ట్రోక్ నుంచి మిమ్మల్ని రక్షించే చెరుకు రసాన్ని తప్పనిసరిగా తాగడం మంచిది.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయ రసం: పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతోపాటు డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడటంతోపాటు ఎండ నుంచి రక్షిస్తుంది.

కొబ్బరి నీరు: ఎండాకాలంలో కొబ్బరినీళ్లు శరీరంలోని శక్తిని పెంచుతాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అలసటను తొలగించి శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.

నిమ్మరసం: నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, మినరల్స్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో నిమ్మరసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..