Skin Care: ముఖంపై జిడ్డు వదలడం లేదా.. వానాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలం ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఇస్తుంది. కానీ తేమ, చెమ్మ కారణంగా చర్మానికి ఎన్నో సమస్యలు వస్తాయి. చెమట, ధూళి, బ్యాక్టీరియా వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దానివల్ల మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ సమస్యల నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అనే విషయాలు నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Skin Care: ముఖంపై జిడ్డు వదలడం లేదా.. వానాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
From Sweat To Skin Infections Skincare

Updated on: Sep 11, 2025 | 8:34 PM

వర్షాకాలంలో పాదాలు ఎక్కువగా తడుస్తుంటాయి. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీని నివారణకు యాంటీ ఫంగల్ సబ్బు ఉపయోగించడం ఒక మార్గం. అయితే, ఈ సబ్బు చర్మాన్ని పొడిగా మారుస్తుంది కాబట్టి మడతల వద్ద మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. స్నానం తర్వాత పాదాలకు యాంటీ ఫంగల్ పౌడర్ వాడాలని నిపుణులు చెప్తున్నారు. వర్షాకాలంలో చర్మం అసాధారణంగా ఉంటుంది. అకస్మాత్తుగా జిడ్డుగా మారడం లేదా పొడిబారడం లాంటివి జరుగుతాయి. దీని నివారణకు కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

క్లెన్సింగ్, టోనింగ్

రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మురికి, చెమట, బ్యాక్టీరియా లాంటివి తొలగిపోతాయి. చర్మం సహజ నూనెలను తొలగించని సోప్ రహిత క్లెన్సర్‌ను ఎంచుకోవాలి. రాత్రి పూట టోనింగ్ తప్పనిసరి. వర్షాకాలంలో గాలి, నీటి ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములు పెరుగుతాయి. ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ టోనర్ చర్మ ఇన్ఫెక్షన్లను అరికడుతుంది.

మాయిశ్చరైజింగ్

వర్షాకాలంలో కూడా మాయిశ్చరైజింగ్ చాలా ముఖ్యం. నిరంతరం తడవడం, ఆరడం వల్ల చర్మం డీహైడ్రేషన్ గురవుతుంది. దీనివల్ల దురద వస్తుంది. తరచుగా తడిస్తే నీరు లేని మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. లేకపోతే నీరు ఆధారిత మాయిశ్చరైజర్ సరిపోతుంది.

సూర్యుడి నుంచి రక్షణ

వర్షాలు కురిసేటప్పుడు ఆకాశం మేఘావృతమై ఉన్నా సూర్యుని UV కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. కనీసం SPF 30 ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.

కొన్ని అదనపు చిట్కాలు

అధిక చెమట పట్టిన ప్రాంతాలలో చర్మాన్ని పొడిగా ఉంచుకోవాలి.

యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.

ఫంగల్, బ్యాక్టీరియా వృద్ధిని నివారించడానికి టవల్స్, దుస్తులు క్రమం తప్పకుండా మార్చాలి.

గమనిక: ఈ కథనం నిపుణుల సలహాలు, సాధారణ చర్మ సంరక్షణ పద్ధతులపై ఆధారపడి రూపొందించబడింది. ఇక్కడ పేర్కొన్న అంశాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా నిర్దిష్ట చర్మ సమస్యకు, దయచేసి అర్హత ఉన్న చర్మ వైద్య నిపుణులను సంప్రదించండి.