
అరటి పండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఇటమిన్లు, మినరల్స్ శరీరానికి కావాల్సిన ఇన్‌స్టంట్ ఎనర్జీని అందిస్తాయి. మలబద్ధకం సమస్యకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. అయితే అరటి పండుతో కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా, వెంట్రుకల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని మీకు తెలుసా.? అవును అరటి పండుతో చేసిన ప్యాక్‌తో వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మనలో చాలా మంది నిర్జీవమైన, పొడి జుట్టు సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్లు రకరకాల షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయితే వీటివల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. పొడి జుట్టు నుంచి ఉపశమనం కలగాలన్నా జుట్టు మృదువుగా మారాలన్నా అరటిపండు ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. ఇంతకీ అరటి పండుతో హెయిర్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? ఏయే మార్గాల్లో అరటి పండు ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం..
ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో అరటిపండు ముక్కలను వేసి మెత్తగా చేయాలి. అనంతరం గిన్నెలో అలోవెరా జెల్ కలపాలి. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. అనంతరం కాసేపు ఆరిన తర్వాత లైట్ షాంపూతో కడిగేసుకోవాలి. అంతే జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది.
గుడ్డు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి గుడ్డును, అరటిపండుతో కలిపి ప్యాక్ చేసుకుంటే మరింత మెరుగైన ఫలితం పొందొచ్చు. పచ్చి కోడి గుడ్డు సోనను అరటి పండును బాగా కలపాలి. అనంతరం ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేసుకుంటే చాలు జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
అరటి పండు, పెరుగు ప్యాక్ కూడా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకోవాలి. అనంతరం పెరుగులో అరటి పండు గుజ్జును వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించాలి. అనంతరం ఒక 40 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది.
ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో 2 నుంచి 3 స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. అనంతరం అందులో మెత్తగా చేసిన అరటి పండును వేసి బాగా కలపాలి. ఇలా తయారైన పేస్ట్‌ను తలకు బాగా పట్టించాలి. ఇలా అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరి జుట్టు మృదువుగా మారడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..