
పాప్ కార్న్ అంటే పిల్లలకు బాగా ఇష్టం. ఆల్ టైమ్ ఫేవరేట్ స్నాక్ ఏది అంటే.. పాప్ కార్న్ అని చెప్పొచ్చు. కేవలం సినిమా హాల్లోనే కాదు.. బయట కూడా ఇష్ట పడి మరీ కొనిపించుకుని తింటారు. అయితే ఇప్పుడు ఫూల్ మఖానా కూడా చాలా పాపులర్ అయింది. ఇది కూడా పిల్లలు ఇష్ట పడి మరీ తింటున్నారు. ఎందుకంటే ఇవి క్రంచీగా కూడా ఉంటుంది. మఖానా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఈ రెండింటిలో ఏది పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తుందో నిపుణులు అధ్యయనం చేశారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మరి వీటిల్లో పిల్లల స్నాక్‌గా ఏది బెటరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫూల్ మఖానా అంటే ఏదో అనుకునేరు. అవేమీ కాదు తామర గింజలు. ఇప్పుడు వీటితో ఎన్నో రకాల కర్రీస్, స్నాక్స్ కూడా తయారు చేస్తున్నారు. చిరు తిండిగా కూడా చాలా మంచిది. మఖానా.. పోషకాల పవర్ హౌస్‌గా చెప్ొచ్చు. ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇది తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కండరాల పని తీరు మెరుగు పడటమే కాకుండా.. గుండెకు కూడా చాలా మంచిది. మఖానా తింటే.. రక్త పోటు అదుపులో ఉంటుంది. ఇది ఎవరు తిన్నా అలెర్జీ వంటి సమస్యలు రావు. కాబట్టి ఏ వయసు వారైనా హ్యాపీగా తినొచ్చు. అనారోగ్యంగా ఉండేవారు మఖానా తినమని వైద్యులు కూడా సిఫారసు చేస్తున్నారు. సమ్మర్‌లో కూడా ఫూల్ మఖానా తినొచ్చు. ఎందుకంటే ఇందులో చలువ చేసే లక్షణాలు ఉన్నాయి.
పాప్ కార్న్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ఇది కూడా ఎంతో రుచికరమైన స్నాక్. పిల్లలు ఇష్ట పడి మరీ తింటారు. ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. పాప్ కార్న్ మొక్కజొన్నతో తయారు చేస్తారు. మొక్క జొన్నలు కూడా ధాన్యం జాతికి చెందినవే కాబట్టి.. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభ్యమవుతాయి. జీర్ణ క్రియకు కూడా ఎంతో సహాయ పడతాయి.
ఈ రెండూ కూడా ఆరోగ్యకరమైనవే. వీటిని తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కాబట్టి రెండింటినీ కూడా పిల్లలకు పెట్టొచ్చు. పాప్ కార్న్, మఖానా రెండూ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)