
ఇండోర్‌కు చెందిన సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సఫ్దర్ హుస్సేన్ అలీ డైటీషియన్ నిధి శుక్లా పాండే హెచ్చరికల ప్రకారం.. ముఖ్యంగా వర్షాకాలం వేసవిలో పచ్చి ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పచ్చి గుడ్లలోని ‘అవిడిన్’ విటమిన్ లోపానికి కారణమైతే, పచ్చి పాలలోని ‘లిస్టెరియా’ వంటి బ్యాక్టీరియా ప్రాణాంతకం కావచ్చు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే పదార్థాలను ఖచ్చితంగా ఉడికించి తినాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పచ్చిగా అస్సలు తినకూడని 7 పదార్థాలు:
పచ్చి గుడ్లు: పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా అనే ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. గుడ్డు తెల్లసొన, పచ్చసొన గట్టిపడే వరకు ఉడికించి తినడమే సురక్షితం.
పచ్చి పాలు: పాశ్చరైజ్ చేయని పాలలో ఇ. కోలి, లిస్టీరియా వంటి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి గర్భిణీలు, పిల్లలకు ఎంతో ప్రమాదకరం. పాలను బాగా మరిగించి తాగడం వల్ల ఈ వైరస్‌లు నశిస్తాయి.
పుట్టగొడుగులు: కొన్ని రకాల పుట్టగొడుగుల్లో ప్రాణాంతకమైన టాక్సిన్లు ఉంటాయి. ఇవి కాలేయం మరియు ఇతర అవయవాలను దెబ్బతీస్తాయి. ఉడికించడం వల్ల వీటిలోని హానికర రసాయనాలు నశించి, జీర్ణక్రియ సులభమవుతుంది.
క్యాబేజీ: క్యాబేజీ ఆకుల్లో పురుగులు లేదా క్రిములు ఉండే అవకాశం ఉంది. అందుకే దీనిని నేరుగా సలాడ్లలో వాడే కంటే, వేడి నీటిలో కొద్దిగా ఉడికించి వాడటం మంచిది.
ఫ్రెంచ్ బీన్స్ : పచ్చి బీన్స్‌లో హానికరమైన అమైనో యాసిడ్లు ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి, బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి. లేదంటే ఇవి విషతుల్యంగా మారతాయి.
పాలకూర : పాలకూరలో ఇ. కోలి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దీనిని ఉడికించడం వల్ల బ్యాక్టీరియా నశించడమే కాకుండా, శరీరానికి పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది.
మొలకలు : మొలకలు ఆరోగ్యకరమే అయినా, వాటిని పెంచే తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా పెరగడానికి కూడా కారణమవుతుంది. బయట కొన్న మొలకలను పచ్చిగా తినకుండా, లైట్‌గా ఫ్రై చేయడం లేదా ఉడికించడం శ్రేయస్కరం.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసే ముందు వైద్యులను సంప్రదించండి.