
అవకాడో.. ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. దీనిని ఎలా తినాలో తెలియక కొందరు, ఒకసారి ట్రై చేసి రుచి నచ్చక మరికొందరు దీన్ని దూరం పెడుతుంటారు. కానీ, అవకాడోను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవకాడోలు మనకు పోషణను అందిస్తాయని, అనేక రోగాలను నయం చేస్తాయని అంటున్నారు. ఇంకా ఎన్నో లాభాలను అందిస్తాయి. అవకాడోలను నేరుగా తినవచ్చు. లేదా స్మూతీలు, సలాడ్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు ఆవకాడో డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. తద్వారా అతిగా తినకుండా ఉంటారు. అవకాడో రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ వల్ల మెదడు అభిజ్ఞ పనితీరుకు తోడ్పడుతుంది. సెల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. అవకాడో తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కడుపులో మంచి ఆరోగ్యకరమైన కదలికలకు తోడ్పడుతుంది.
అవకాడో అజీర్తి, మలబద్దక సమస్యకు నివారిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఆరోగ్యకరమైన గుండెకు అవకాడో డైట్లో చేర్చుకోవాలి. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అవకాడో హార్ట్ ఎటాక్ సమస్య, స్ట్రోక్ కూడా నివారిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..