Weight Lose Diet: చలికాలంలో వీటిని తింటే ఎంత బరువు అయినా మాయమవ్వాల్సిందే.. అవేమిటంటే..

|

Jan 18, 2023 | 1:06 PM

జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మరింతగా బరువు పెరుగుతుంటారు. అయితే చలికాలంలో కొన్ని రకాల ఆహారాలను మన డైట్‌లో భాగం చేసుకుంటే..

Weight Lose Diet: చలికాలంలో వీటిని తింటే ఎంత బరువు అయినా మాయమవ్వాల్సిందే.. అవేమిటంటే..
Winter Diet For Weight Lose
Follow us on

ప్రస్తుత కాలంలో అధిక బరువు అనేది అందరినీ వేధిస్తున్న సమస్య. నాజూకైన నడుము, అందమైన ఫిగర్ ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ సమయానుకూలంగా సరైన డైట్‌ మాత్రం పాటించరు. అంతకాక పాటిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మరింతగా బరువు పెరుగుతుంటారు. అయితే ముఖ్యంగా చలికాలంలో కొన్ని రకాల ఆహారాలను మన డైట్‌లో భాగం చేసుకుంటే ఇట్టే బరువు తగ్గేయవచ్చు. మరి అందుకోసం చలికాలంలో ఏయే ఆహారాలను మన డైట్‌లో చేర్చుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. వాల్నట్స్: వాల్‌నట్స్‌లో ఎన్నో ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. ఇంకా శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తాయి.
  2. మఖానా: మఖానాలో ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో మఖానా తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాక వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. మఖానా తినడం వల్ల శరీరానికి కూడా ఎంతో శక్తి లభిస్తుంది. ఇది జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
  3. జామ: బరువు తగ్గించడంలో జామకాయలోని ఔషధ గుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. జామపండులో విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్లు పెద్ద మొత్తంలో లభిస్తాయి. చలికాలంలో జామ పుష్కలంగా లభిస్తుంది. జామపండును అల్పాహారంగా చేర్చుకోవడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
  4. బత్తాయి: బత్తాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. బత్తాయి తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. దీనిలోని ఫైబర్ జీవక్రియను పెంచడానికి పనిచేస్తుంది. ఆ విధంగా బత్తాయి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. క్యారెట్‌: క్యారెట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో క్యారెట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్‌లో ఫైబర్ ఎక్కువగా, కేలరీ తక్కువగా ఉంటాయి. ఇది పొట్టను త్వరగా నింపుతుంది. తద్వారా ఆకలి రేటును తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..