Blood Pressure: బీపీని కంట్రోల్‌ చేయాలంటే ఎటువంటి ఆహారం తినాలి..! ఏ సమయంలో తీసుకుంటే మంచిది..

|

Sep 26, 2021 | 2:54 PM

Blood Pressure: ప్రస్తుతం అధిక మంది బాధపడుతున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. కనీసం 30 ఏళ్లు నిండని వారు కూడా హైబీపీ బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి,

Blood Pressure: బీపీని కంట్రోల్‌ చేయాలంటే ఎటువంటి ఆహారం తినాలి..! ఏ సమయంలో తీసుకుంటే మంచిది..
Blood Pressure
Follow us on

Blood Pressure: ప్రస్తుతం అధిక మంది బాధపడుతున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. కనీసం 30 ఏళ్లు నిండని వారు కూడా హైబీపీ బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆనారోగ్య అలవాట్లు, మానసిక ఆందోళన, అధిక ఒత్తిడిల కారణంగా ఈ అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ఈ హైబీపీ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇది హృదయ సంబంధ రోగాలకు కూడా దారి తీస్తుంది. అందుకే, హైబీపీ రాకుండా అత్యంత జాగ్రత్త వహించాలంటున్నారు వైద్య నిపుణులు. మనం రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో బీపీని కంట్రోల్ చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1. తృణధాన్యాలు
సాధారణంగా బీపీతో బాధపడేవారు ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే ధాన్యపు పిండిని ఉపయోగించాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చాలని వైద్యులు సూచిస్తున్నారు. 2010 లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తృణధాన్యాలు అధికంగా ఉన్న ఆహారాలు బీపీని కంట్రోల్‌ చేస్తాయని తేలిందన్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె ఆగిపోవడం వంటి ప్రమాదాలను తగ్గిస్తాయని తెలిపారు.

2. ఓట్స్ పిండి
వోట్స్ ను పిండిగా మార్చవచ్చు. వీటి ద్వారా అనేక రకాల తీపి, రుచికరమైన వంటలను తయారుచేయవచ్చు. ఓట్స్‌ను గ్రైండర్‌లో వేసి చక్కగా పొడిలా చేయాలి. ఓట్స్‌తో తయారుచేసిన వస్తువులు బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. బుక్వీట్ మరొక తృణధాన్యం. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది గ్లూటెన్ రహితమైనది. అలెర్జీ ఉన్నవారు కూడా దీన్ని తినవచ్చు. బీపీ రోగులు దీనిని కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు.

3. బార్లీ పిండి
బార్లీ భూమిపై మొట్టమొదటిగా పండించిన ధాన్యాలలో ఒకటి. ఈ పురాతన ధాన్యాన్ని మళ్లీ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. బార్లీ గడ్డి కుటుంబానికి చెందినది. బీపీని కంట్రోల్‌ చేయడానికి బార్లీ పిండి చక్కగా ఉపయోగపడుతుంది.100 గ్రాముల బార్లీలో 17 గ్రాముల డైటరీ ఫైబర్, 12 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఇంకా గోధుమ పిండి కూడా బీపీని కంట్రోల్ చేస్తుంది. ప్రతి రోజు చపాతీలు తింటే చాలా మంచిది.

Natural Star Nani : సీఎం జగన్‌కు హీరో నాని రిక్వెస్ట్.. పవన్ కళ్యాణ్‌కు థాంక్స్..

Hindu Temples in Pakistan: పాకిస్థాన్‌లో త్రేతాయుగం, ద్వాపర యుగం నాటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు..

CSK vs KKR Live Score, IPL 2021: అయ్యర్‌తోనే పరేషాన్.. కోహ్లీ, రోహిత్‌లు ఓడిపోయారు.. మరి ధోని ఏం చేయనున్నాడో..!