Cardamom Milk: రాత్రిపూట ఇలా తయారు చేసిన పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

వంటల్లో సువాసన కోసం ఉపయోగించే యాలకులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక రకాల ఔషధ గుణాలు నిండి వున్నాయి. అయితే, ఈ యాలకుల పొడిని పాలలో తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Cardamom Milk: రాత్రిపూట ఇలా తయారు చేసిన పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Cardamom Milk

Updated on: Apr 22, 2025 | 4:09 PM

రోజూ క్రమం తప్పకుండా యాలకుల పొడి కలిపిన పాలు తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. నిద్ర బాగా పడుతుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. ఈ పొడి కలిపిన పాలు రోజూ సేవిస్తే మెటబోలిజం వేగవంతమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఒత్తిడి, టెన్షన్ దూరం చేస్తాయి. రోజు యాలకుల పాలు తాగడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని విష పదార్ధాల్ని తొలగిస్తాయి. ఇమ్యూనిటీ పెంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కాపాడుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. హెల్తీ సెల్స్ అభివృద్ధి చేస్తాయి. ప్రతిరోజు యాలకుల పాలు తాగడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కేన్సర్ కారకాలు పెరగకుండా నియంత్రిస్తాయి. యాలకులు సాధారణంగా స్వీట్స్ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. రోజు రాత్రి పూట యాలకులపాలు తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి.  అలాగే దగ్గు జలుబు ఆస్తమా వంటి వ్యాధులను తరిమికొట్టేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేదన గుణాలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..