Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు..!

|

Oct 17, 2021 | 4:27 PM

Health Care Tips: శరీర బరువు పెరిగే కొద్దీ.. అనేక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో మనల్ని మనం ఫిట్‌గా ఉంచుకోవడం ఎంతో అవసరం.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు..!
Weight Loss Tips
Follow us on

Weight Loss Tips:పరుగుల జీవితంలో మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదే సమయంలో మన శరీర బరువు పెరిగే కొద్దీ అనేక వ్యాధులకు ఆహ్వానం పలికినట్లే. ఇలాంటి పరిస్థితిలో మనల్ని మనం ఫిట్‌గా ఉంచుకోవడం ఎంతో అవసరం. అయితే ఇకనుంచి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సులభంగా బరువు తగ్గేందుకు మూడు ముఖ్యమైన చిట్కాలను అందించబోతున్నాం. వీటిని పాటించి తేలికగా బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంది.

1. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తగ్గించండి: వేగంగా బరువు తగ్గడానికి ఒక మార్గం చక్కెర, పిండి పదార్ధాలు లేదా రిఫైన్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం తగ్గించడమే. వీటితో పాటు శుద్ధి చేసిన పిండి పదార్థాలను తీసుకోవడం కూడా తగ్గించాలి. వాటి స్థానంలో ధాన్యాలను చేర్చుకుంటే అద్భుత ఫలితం పొందవచ్చు. ఇలా ధాన్యాలను తీసుకోవడం వల్ల ఆకలి తక్కువగా అనిపిస్తుంది. దీంతో తక్కువ కేలరీలు తీసుకోవడం అలవాటు అవుతోంది. దీంతో బరువును త్వరగా తగ్గవచ్చు.

2. ఆకుపచ్చ కూరగాయలు తినండి: మీ ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ పదార్థాలు, కూరగాయలు, ధాన్యాలు వంటి క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండెను ప్రమాదాల నుంచి కాపాడుకునే శక్తి మెరుగుపడుతుంది. దీంతో పాటుగా, ఆకలి, శరీర బరువును తగ్గించడానికి ప్రోటీన్లు కూడా అవసరం. కాబట్టి, ప్రతిరోజూ మీ ఆహారంలో పప్పులు, పచ్చి కూరగాయలను చేర్చుకోవడం ద్వారా శరీరానికి తగిన ప్రోటీన్లు అందించి, వేగంగా బరువు తగ్గొచ్చు.

3. వ్యాయామం: బరువు తగ్గడానికి వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ వేగంగా పని చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు తప్పనిసరిగా కనీసం 30 నిమిషాల వ్యాయామం మన శరీరానికి అవసరం. అలాగే ఆహారం తిన్న తరువాత కొద్దిసేపు నడక చేయడం కూడా ముఖ్యం.

Also Read: Foods For Healthy Bones: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాల్సిందే..!

ఈ లక్షణాలు మీలో ఉంటే చాలా ప్రమాదం..! చికిత్స తీసుకోకపోతే అంతే సంగతులు

Praising Children: పిల్లలను అతిగా ప్రశంసిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. తాజా పరిశోధనలో కీలక విషయాలు..!