Weight Gain In Winter: చలికాలంలో బరువు పెరగడానికి వివిధ కారకాలు దారితీస్తాయి. అయితే ఎక్కువ బరువు పెరగకుండా ఉండటానికి నిపుణులు పలు చిట్కాలు అందిస్తున్నారు. చలికాలంలో మంచి ఆహారం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం వరకు ఇలా ఎన్నో కారణాలు ఒంటి బరువు పెరగడానికి కారణాలుగా మారతాయి. ఉష్ణోగ్రత తగ్గుతున్న కొద్దీ, ఉదయాన్నే లేవడం ప్రతి రోజు కష్టతరంగా మారుతుంది. దీంతో రోజువారీ వ్యాయామం చేయడం కూడా తగ్గిపోతుంది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల శారీరక శ్రమ కూడా సాధారణంగా తగ్గిపోతుంది. దీని వల్ల బరువు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
అలాగే వింటర్ సీజన్‌లో పెరిగిన ఆకలి పెరగడం కూడా అధిక బరువుకు కారణమవుతుంది. అయితే చలి కాలంలో అంతా చక్కగా ప్లాన్ చేసుకోకుంటే చాలా నష్టపోతుంటాం. శారీరక వ్యాయామానికి కూడా సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఒంట్లో విపరీతంగా కొవ్వు బాగా పెరిగిపోతుంది. జంక్ ఫుడ్‌ను తినే బదులు, పెరిగిన ఆకలిని నివారించడానికి తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తినండం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. చలికాలంలో బరువు పెరగడానికి ఐదు కారణాలతోపాటు అనుకోని బరువను ఎలా తగ్గించుకోవాలో కూడా నిపుణులు వెల్లడిస్తున్నారు.
చలికాలంలో బరువు పెరగడానికి కారణాలు
ఉష్ణోగ్రతలో ఆకస్మిక తగ్గుదల: చలికాలంలో బయట తిరగడం ఎక్కువగా కుదరదు. దీంతో ఉదయాన్నే జిమ్‌లకు వెళ్లడం లేదా వ్యాయామం చేయడం మానుకుంటారు. శారీరక శ్రమ తగ్గడంతో బరువు పెరగడానికి దారితీస్తుంది.
తక్కువ సమయం: శీతాకాలపు నెలలలో పగలు సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఇది రోజువారీ దినచర్యలకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువగా బయట గడపడం కుదరదు.
రాత్రి సమయం ఎక్కువ: రాత్రులు ఎక్కువ కాలం ఉన్నందున, ఎక్కువ సమయం నిద్రపోయేందుకు కేటాయిస్తుంటారు. ఇది కూడా ఓ కారణం కావొచ్చు.
సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్: ఇది కాలానుగుణ మార్పులతో సంబంధం ఉన్న ఒక రకమైన డిప్రెషన్. ఇది మానసిక కల్లోలం, నిష్క్రియాత్మకత, శక్తి స్థాయిలలో తగ్గుదలకు దారితీస్తుంది. ఇలాంటి వ్యక్తులు వ్యాయామం చేయాలని లేదా బయటకు వెళ్లాలని భావించకపోవచ్చు. అంతేకాకుండా, సూర్యరశ్మి సరిగ్గా అందకపోవడం కూడా బరువు పెరగే అవకాశం ఉంది.
వెచ్చగా ఉండే ఆహారాన్ని తినడం: శీతాకాలంలో, చాలా మంది టీ, కాఫీ, కుకీలు, ఇతర రకాల స్వీట్‌ల కోసం ఆరాటపడుతుంటారు. చాలా మంది సోడియంతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. దీంతో ఒంట్లో ఉబ్బరంతోపాటు బరువు పెరగడానికి దారితీస్తుంది.
చలికాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
బరువు పెరగడానికి దారితీసే పైన పేర్కొన్న వాటిని నివారించడంతో పెరిగే బరువను అదుపులో ఉంచుకోవచ్చు. అందుకు కొన్ని చిట్కాలకు పాటించాలి. అవేంటో చూద్దాం.
తగినంత సూర్యకాంతి: సూర్యరశ్మిలో ప్రతిరోజూ బయటికి రావాలి. ఇది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వంటి పరిస్థితులను దూరంగా ఉంచుతుంది.
ఇంటి లోపల వ్యాయామం చేయండి: చలికాలంలో ఇండోర్ వ్యాయామం చేయడం మంచి ఎంపిక. మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రతి భోజనం తర్వాత నడవడం మర్చిపోవద్దు. ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కండి.
ఆహారంలో మార్పులు: తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు కలిగిన ఆహారాన్ని తీసుకోండి. జంక్, ప్రాసెస్డ్, ఆయిల్, క్యాన్డ్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. ధూమపానం, మద్యం మానాలి. బదులుగా ఎక్కువగా నీరు తాగుతూ అనవసరంగా పెరిగే బరువను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
Also Read: Health Tips: స్నానం చేసే ముందు నీటిలో వేపాకు వేసుకుంటే ఎన్నో లాభాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలరు..
Health: మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? అయితే మీరు హైబీపీ బారిన పడినట్లే.. ముందే జాగ్రత్త పడండి..