Shawarma Puri: అరబిక్ ఆహారం అంటే ఇష్టమా.. భాగ్యనగరంలో సరికొత్త స్ట్రీట్ ఫుడ్.. షవర్మ పూరీ ఆవిష్కరణ..

షవర్మ ప్రస్తుతం భాగ్యనగరం వీధుల్లో దర్శనం ఇస్తున్న ఒక రకమైన ఆహారం. వాస్తవానికి మన దేశంలో ప్రస్తుతం పాపులర్ స్ట్రీట్ ఫుడ్ అయిన ఈ షవర్మకు పుట్టినిల్లు గల్ప్ దేశాలు. అక్కడ బాగా పాపులర్ వంటకాల్లో ఒకటి. షవర్మని ఎక్కువగా అరేబియన్, ఇటలీ, ఓమన్ దేశాలలో ఇష్టంగా తింటారు. మన దేశంలో అడుగు పెట్టి ఆహార ప్రియుల ఆదరణ సొంతం చేసుకున్న షవర్మకి హైదరాబాద్ నగరంలో సరికొత్త రూపాన్ని తీసుకొచ్చారు. గత కొంతకాలంగా హైదరాబాద్ పాక ప్రయోగాలకు ఆట స్థలంగా మారింది. తాజా షవర్మ పూరి స్ట్రీట్ ఫుడ్ మెనూలో సరికొత్తగా చేరింది.

Shawarma Puri: అరబిక్ ఆహారం అంటే ఇష్టమా.. భాగ్యనగరంలో సరికొత్త స్ట్రీట్ ఫుడ్.. షవర్మ పూరీ ఆవిష్కరణ..
'shawarma Puri

Updated on: Apr 18, 2025 | 10:34 AM

హైదరాబాద్ ప్రజలకు అరబిక్ ఆహారం అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. మండి నుంచి కునాఫా వరకు ప్రతి అరేబియా వంటకం భాగ్య నగరంలో హిట్ అవుతుంది. అలాంటి స్ట్రీట్ ఫుడ్ లో షవర్మా అత్యంత ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా షవర్మా.. క్లాసిక్ రెసిపీ మార్చుకోవడం మొదలు పెట్టుకుంది. దాని తయారీ శైలి హైదరాబాద్‌లో వివిధ పరివర్తనలకు గురైంది. అయితే ఇప్పుడు, ఒక రెస్టారెంట్ పానీ పూరి షెల్స్ లోపల షవర్మాను వడ్డించి అందిస్తుంది. ఈ ఆవిష్కరణతో షవర్మ లవర్స్ ను ఒక మెట్టు పైకి తీసుకెళ్లింది.

తార్నాకలోని ఎక్సోటిక్ గ్రిల్ అనే ఈటరీ షావర్మా పానీ పూరిని అందిస్తుంది. ఇది మిడిల్ ఈస్టర్న్ మసాలా దినుసులను భారతీయ వీధి ఆహార శైలితో అందిస్తున్నారు. జ్యుసి షవర్మ మాంసం, క్రీమీ వెల్లుల్లి మాయో, కరకరలాడే కూరగాయలతో నింపిన క్రిస్పీ గోల్ గప్ప షెల్స్ ను కలిపి తినడం ఒక అనుభూతిని అందిస్తుంది. ఇది హైదరాబాద్ లో అభివృద్ధి చెందుతున్న ఆహార సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తున్న ఊహించని కలయిక.

హైదరాబాద్‌లో ఫ్యూజన్ ఫుడ్స్

ఇవి కూడా చదవండి

గత కొన్ని ఏళ్లగా భాగ్య నగరం పాక ప్రయోగాలకు ఆట స్థలంగా మారింది. ఫ్యూజన్ వంటకాలతో ట్రెండ్ ను సృష్టిస్తోంది. హలీమ్ దోస, చాక్లెట్ మ్యాగీ నుంచి షవర్మా పూరి వరకు హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ ఆహార దృశ్యం, సుపరిచితమైన రుచులతో ఆహార ప్రియులను అలరిస్తుంది.

అయితే ఈ షవర్మా పూరి హైదరాబాద్‌కు పూర్తిగా కొత్త కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని ఫుడ్ స్టాల్స్ ఈ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినప్పుడు మొదట వైరల్ అయింది. అప్పట్లో ఈ స్ట్రీట్ ఫుడ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంతమంది భోజనప్రియులు దీనిని ఒక గిమ్మిక్ అని కొట్టిపారేశారు, మరికొందరు అలాంటి బోల్డ్ మాషప్‌కు సిద్ధంగా లేరు.

ఈ కొత్త షవర్మా పూరి భవిష్యత్తు ఇంకా తెలియకపోయినా..ఒక విషయం స్పష్టం అవుతుంది. ఈ కలయికతో హైదరాబాద్ ఆహార సంస్కృతి అభివృద్ధి చెందుతూనే ఉంది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా రెస్టారెంట్స్ వివిధ రకాల ఆహారపై ప్రయోగాలను చేస్తూనే ఉన్నాయి. సంప్రదాయాన్ని ట్రెండ్‌తో, నోస్టాల్జియాను కొత్తదనంతో మిక్స్ చేసి సరికొత్త ఆహారాలను రెడీ చేస్తున్నారు. ప్రతి వంటకం హిట్ అయినా కాకపోయినా, భిన్నమైనదాన్ని ప్రయత్నించాలనే సంకల్పం నగరం పాక స్ఫూర్తిని సజీవంగా ఉంచుతుంది. కనుక ఆహార ప్రియులు భాగ్య నగరంలో నెక్స్ట్ ప్రయోగం కోసం ఎదురు చూస్తూ ఉండండి..

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..