Amla Benefits: వ్యాధులను తగ్గించే ఉసిరికాయలు.. రోజూ ఇలా తింటే అనారోగ్య సమస్యలు ఫసక్..

|

Jul 07, 2021 | 1:36 PM

ఉసిరి కాయలు కేవలం జుట్టు, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని తెలిసిన విషయమే.

Amla Benefits: వ్యాధులను తగ్గించే ఉసిరికాయలు.. రోజూ ఇలా తింటే అనారోగ్య సమస్యలు ఫసక్..
Amla
Follow us on

ఉసిరి కాయలు కేవలం జుట్టు, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని తెలిసిన విషయమే. అయితే ఉసిరి కాయలు అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ ఎక్కువగా సహాయపడతాయి. ఉసిరికాయలను గూస్బెర్రీ, ఆమ్లా అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఇందులో విటమిన్ సి, కాల్షియం, భాస్వరం, ఐరన్, కెరోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో ఆరోగ్యకమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. రోజూ మనం తీసుకునే ఆహారంలో ఉసిరి కాయలను జత చేయడం వలన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. శరీరంలోని విషాన్ని కూడా తొలగిస్తుంది. అలాగే వృద్ధాప్య సమస్యలు రాకుండా.. ప్రీరాడికల్స్‏తో పోరాడుతుంది. అయితే రోజూ ఉసిరి కాయలను తీసుకోవడం కాస్త కష్టమే. అయితే కొన్ని రకాలుగా రోజూ వారీ ఆహారంలో తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందామా.

ఆమ్లా జ్యూస్..
రోజూ ఆమ్లాను నేరుగా తీసుకోకుండా.. జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అయితే కొందరికి డైరెక్ట్ ఆమ్లా జ్యూస్ తాగడం నచ్చకపోవచ్చు. అలాంటి వారు … అందులో క్యారట్, అల్లం, దుంప, పుదీనా వేసి తాగొచ్చు. అయితే ఇందులో నల్ల ఉప్పును ఉపయోగిస్తే మంచిది.

ఉసిరి కాయ పచ్చడి..
చాలా మంది పచ్చళ్లు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆమ్లా ఉరగాయ కూడా రోజూ వారి ఆహారంలో తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఉసిరి కాయలను పది నిమిషాలు నీటిలో ఉడకెట్టి.. ఫిల్టర్ చేసి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని కట్ చేసి అందులో విత్తనాలను తొలగించండి. ఆ తర్వాత ఓ బాణాలిలో ఆవ నూనె, మెంతి గింజల పొడి, సోపు గింజలు, ఆసాఫోటిడా, కారం, పసుపు, ఉప్పు వేసి అందులో ఉసిరి కాయ ముక్కలను కలపాలి. దీనిని ఒక గాజు కూజాలో నింపి వారం పాటు ఎండలో ఉంచాలి.

ఆమ్లా చట్నీ..
ఉదయాన్నే ఆమ్లా చట్నీని రోటిలతో తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఆమ్లాతోపాటు.. పుదీనా, కొత్తిమీరా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పచ్చడి చేయాలి. దీనిని రోజు ఉదయాన్నే అల్పహారం సమయంలో తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు.

Also Read: