AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క గ్లాస్ తాగితే వీక్ అయిన నరాలు కూడా చురుకుగా మారుతాయి.. శరీరానికి కొండంత బలం..

రాగి జావ పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే సంప్రదాయ ఆహారం. ఇందులో కాల్షియం, ఫైబర్, ఐరన్, ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. రాగి పిండిని నీటిలో ఉండలు లేకుండా కలిపి ఉడికించి, చల్లారిన తర్వాత మజ్జిగ కలిపితే రుచికరమైన రాగి జావ లేదా రాగి అంబలి సిద్ధమవుతుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి తీసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.

ఒక్క గ్లాస్ తాగితే వీక్ అయిన నరాలు కూడా చురుకుగా మారుతాయి.. శరీరానికి కొండంత బలం..
Ragi Java Recipe
Shaik Madar Saheb
|

Updated on: Oct 16, 2026 | 12:40 PM

Share

మన పూర్వీకులు ఆరోగ్యం కోసం ఎంచుకున్న అత్యంత పోషకాహారాల్లో రాగులు (Finger Millet) ఒకటి.. నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మరుగున పడుతున్న ఈ అద్భుతమైన ఆరోగ్య రహస్యాన్ని మన దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యమని డైటీషియన్లు చూస్తున్నారు. రాగి జావ, రాగులతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా.. ఎన్నో సమస్యలను నియంత్రించవచ్చు.. ముఖ్యంగా రాగి జావ ఎముకల బలాన్ని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

ఎన్నో పోషకాలు..

రాగి జావలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు, బి విటమిన్లు అద్భుతంగా ఉంటాయి.. రాగులలో ఉన్న ఈ పోషకాలు ఎముకలను బలోపేతం చేయడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.. అంతేకాకుండా.. రక్తహీనతను నివారించి నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. నరాలు బలపడతాయని.. చురుకుగా మారుతాయని పేర్కొంటున్నారు డైటీషియన్లు..

రోజంతా శక్తినిస్తుంది:

ఉదయాన్నే రాగి జావ సేవించడం వల్ల రోజంతా శరీరం ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటుంది. అన్ని వయసుల వారికీ ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ కథనంలో రుచికరమైన ‘రాగి జావ’ తయారీ విధానాన్ని తెలుసుకోండి.

రాగి జావ తయారీ విధానం..

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీరు పోసి, మీడియం మంటపై బాగా మరగనివ్వాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈలోపు వేరే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకుని, కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. నీరు బాగా మరుగుతున్న సమయంలో, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో పోస్తూ గరిటెతో తిప్పుకోవాలి. మీడియం మంటపై సుమారు 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి

రాగి జావ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గరిటెతో తిప్పుతూ పూర్తిగా చల్లారబెట్టాలి (పై మీగడ కట్టకుండా చూసుకోవాలి). జావ పూర్తిగా చల్లారిన తర్వాత, అందులో చిక్కటి మజ్జిగ పోసి బాగా కలుపుకోవాలి. అంతే.. ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన రాగి జావ లేదా రాగి అంబలి సిద్ధం అవుతుంది. దీన్ని ప్లెయిన్‌గా తీసుకోవచ్చు లేదా కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు కలుపుకుని సేవిస్తే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us