మోకాళ్లల్లో గుజ్జును పెంచి.. శరీరాన్ని బలంగా మార్చే సూపర్‌ఫుడ్.. 10 రోజులకు ఒకసారి తినండి చాలు..
కోడి కాళ్ల కూరను చాలామంది విస్మరిస్తారు.. కానీ ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. శరీరం బలంగా మారుతుంది.. చముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి, మోకాళ్ళ గుజ్జు పెరిగేందుకు ఇది సహాయపడుతుంది. ఈ కథనంలో రుచికరమైన కోడి కాళ్ల కూర వంట విధానం, దాని ఉపయోగాలు గురించి తెలుసుకుందాం..

భారతీయ వంటకాల్లో ఆరోగ్యాన్ని, రుచిని అందించే అనేక సాంప్రదాయ వంటకాలు ఉన్నాయి. వాటిలో మాంసాహారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. మటన్, చికెన్, ఫిష్ ను .. నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. చికెన్ ను ఎక్కువగా తింటారు.. అయితే.. కోడి మాంసంతోపాటు.. కోడి కాళ్ల కూర అద్భుతంగా ఉంటుంది. కొంతమంది రెగ్యులర్ గా తింటారు కూడా.. అయితే.. చాలామంది కోడి కాళ్లను ఆహారంగా తీసుకోవడానికి వెనుకాడతారు.. కానీ దీనికి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి, మోకాళ్ళ గుజ్జు పెరగడానికి ఇది ఎంతో సహాయపడుతుందని పేర్కొంటున్నారు డైటీషియన్లు.. కోడి కాళ్లు (చికెన్ ఫీట్ / లెగ్స్) తినడం వల్ల శరీరానికి బలం, మెరుగైన చర్మ ఆరోగ్యం వంటి అనేక పోషక లాభాలు కలుగుతాయి.
ఎన్నో పోషకాలు.. ప్రయోజనాలు..
కోడి కాళ్లలో ప్రోటీన్ తోపాటు.. ఐరన్, జింక్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.. వీటితోపాటు.. కొల్లాజెన్, క్యాల్షియం, జెలటిన్ శారీరాన్ని మరింత బలంగా మారుస్తాయి..
మోకాళ్ళ నొప్పుల నివారణ: కోడి కాళ్ళలో కొల్లాజెన్, గ్లూకోసమైన్, కాండ్రాయిటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ళ ఆరోగ్యానికి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి.
కొల్లాజెన్ కీళ్ల మధ్య ఉండే గుజ్జు (మృదులాస్థి) ఏర్పడటానికి, దాన్ని బలంగా ఉంచడానికి చాలా అవసరం. కోడి కాళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మోకాళ్ళ గుజ్జు పెరిగి, కీళ్లు మరింత పటిష్టంగా మారుతాయి.
ఇంకా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపించడానికి తోడ్పడతాయి.. జుట్టు కుదుళ్లు, గోర్లను బలంగా మారుస్తాయి.. వ్యాయామం చేసేవారికి.. కండరాల వృద్ధికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇంకా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, అలసటను తగ్గిస్తాయి. అందుకే కోడి కాళ్ల సూప్.. కూర తినాలని సూచిస్తున్నారు.
కోడి కాళ్ల కూర తయారీ విధానం:
కోడి కాళ్లను మంచిగా శుభ్రం చేసుకోవాలి.. పసుపు, ఉప్పు వేసి.. రుద్ది కడిగి శుభ్రం చేసుకోవాలి..
ముందుగా కూరగాయల తయారీ: ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు వంటి కూరగాయలను శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా ఉల్లిగడ్డలను సన్నగా తరిగి, టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
వంట ప్రారంభం: స్టవ్ వెలిగించి, ఒక వెడల్పాటి గిన్నె లేదా కడాయిని ఉంచాలి. గిన్నె వేడెక్కిన తర్వాత తగినంత నూనె పోయాలి.
పోపు తయారీ: నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిగడ్డలు వేసి బాగా వేయించాలి. ఉల్లిగడ్డలు బంగారు రంగులోకి మారి, మెత్తగా మగ్గే వరకు వేయించడం ముఖ్యం.
మసాలాలు చేర్చే క్రమం: ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం వేసి బాగా కలపాలి.
టమాటాలు, ఉప్పు: ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలను వేసి, త్వరగా మగ్గడానికి సరిపడా ఉప్పును చేర్చాలి. గిన్నెపై మూత పెట్టి, టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
కోడి కాళ్లు చేర్చడం: టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత, శుభ్రం చేసుకున్న కోడి కాళ్లను కూరలో వేయాలి. కోడి కాళ్లను మసాలాలతో బాగా కలిపి, సుమారు 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఈ సమయంలో కోడి కాళ్లలోని రసం విడుదల అవుతుంది.
10 నిమిషాల తర్వాత, ముక్కలు బాగా ఉడకడానికి తగినంత నీళ్లు పోసి, మళ్లీ మూత పెట్టి, కోడి కాళ్లు మెత్తగా అయ్యే వరకు, కూర దగ్గర పడే వరకు ఉడికించాలి.
కూర దగ్గర పడి, కోడి కాళ్లు పూర్తిగా ఉడికిన తర్వాత, కొద్దిగా గరం మసాలా పొడి, కొబ్బరి పొడి వేసి కలపాలి. చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
చాలామంది ఈ ప్రయోజనాల గురించి తెలియక కోడి కాళ్లను తినడానికి ఇష్టపడరు. కానీ మోకాళ్ళ సమస్యలు ఉన్నవారు వారానికి.. రెండు లేదా మూడు వారాలకు ఒకసారి ఈ కూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
