Peanuts Benefits
Peanuts Benefits: వంట గదిలో కనిపించే వేరుశెనగలను నిత్యం చూస్తూనే ఉంటాం, కానీ వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియక తినకుండా వదిలేస్తుంటాం. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలు, లక్షణాలు వేరుశెనగల్లో పుష్కలంగా ఉన్నాయి. వేరుశెనగల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. ఇంకా ఆకలి కోరికలను నియంత్రించి, అధిక బరువుకు చెక్ పట్టడంలో కూడా ఉపయోగపడతాయి. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్నికూడా నిరోధిస్తాయి. అసలు ఈ వేరుశెనగలతో ఆరోగ్యానికి ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
- అధిక బరువు: ఊభకాయం, అధిక బరువుతో బాధపడేవారికి వేరుశెనగలు సహాయపడతాయి. వీటిలో ఎక్కువగా ఫైబర్, తక్కువ మొత్తంలో కేలరీలు, కొవ్వు, సోడియం ఉంటాయి. ఆ కారణంగా మీరు వేరుశెనగలను పరిమితంగా తింటే చాలు, ఆయా సమస్యలకు నెల రోజుల్లోనే చెక్ పెట్టేయొచ్చు.
- క్యాన్సర్: అనేక అధ్యయనాల ప్రకారం పెద్దప్రేగు కాన్సర్‌ను నివారించడంలో వేరుశెనగలు ఉపకరిస్తాయి. వీటిలోని పోషక లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. వేరుశెనగలో ఉండే విటమిన్ ఈ పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, కాలేయం, ఇతర క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది.
- గుండె ఆరోగ్యం: వేరుశెనగల్లో పుష్కలంగా ఉండే పి -కొమరిక్ యాసిడ్ గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే అసంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. కార్డియోవాస్కులర్, కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా వేరుశెనగలు ఉపయోగపడతాయి. ఇంకా శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కూడా నియంత్రించగలవు.
- ధృఢమైన ఎముకలు: వేరుశెనగల్లోని ఐరన్, కాల్షియం ఎముకలను ధృఢపరచడంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఎముకలకు ఉపయోగపడతాయి.
- డయాబెటిస్: వేరుశెనగలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. ఇంకా ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- పిత్తాశయ రాళ్ల నివారణ: పిత్తాశయంలోని రాళ్ళను తొలగించే శక్తి వేరుశెనగలకు ఉండని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ః