Banana Flower: పండు మాత్రమే కాదు, పువ్వు కూడా ప్రయోజనకరమే.. తీసుకుంటే రక్తహీనత, క్యాన్సర్‌కు చెక్..

మానవ ఆరోగ్యాన్ని కాపాడడంలో అరటి పండు ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే పండుతోనే కాదు.. అరటి పువ్వుతో కూడా అద్భుత ప్రయోజాలను పొందవచ్చు. అరటి పువ్వులో పుష్కలంగా ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాలే..

Banana Flower: పండు మాత్రమే కాదు, పువ్వు కూడా ప్రయోజనకరమే.. తీసుకుంటే రక్తహీనత, క్యాన్సర్‌కు చెక్..
Banana Flower Benefits

Updated on: Apr 19, 2023 | 10:07 PM

Banana Flower: మానవ ఆరోగ్యాన్ని కాపాడడంలో అరటి పండు ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే పండుతోనే కాదు.. అరటి పువ్వుతో కూడా అద్భుత ప్రయోజాలను పొందవచ్చు. అరటి పువ్వులో పుష్కలంగా ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాలే అందుకు కారణం. ఇక అరటి పువ్వులో ఉండే మినరల్స్ గురించి చెప్పుకోవాలంటే దీని నుంచి కాల్షియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఐరన్‌ వంటివి ఉంటాయి. అందుకే ఈ పువ్వులను సలాడ్లు, సూప్‌గా తీసుకుంటుంటారు. ఈ క్రమంలో అరటి పువ్వుతో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటీస్: అరటిపువ్వులోని ఔషధ లక్షణాలు మధుమేహాన్ని నియంత్రిండంలో ఉపయోగకరంగా ఉంటాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. శరీరంలోని గ్లూకోజ్‌ను పెంచడంతో పాటు ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.

క్యాన్సర్, గుండె జబ్బుల నివారిణి: అరటి పువ్వు క్యాన్సర్, గుండె జబ్బుల నివారణలో ఉపయోగపడుతుంది. అరటి పువ్వులలో ఉండే ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇంకా ఆక్సీకరణ నష్టాన్ని నివారించి.. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక శక్తి: అరటి పువ్వులో పుష్కలంగా ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా  యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపచేస్తాయి.

కిడ్నీల ఆరోగ్యం: అరటి పువ్వులో ఉండే అనేక పోషకాలు మూత్రపిండాల ఆరోగ్యకరమైన పనితీరును ప్రేరేపిస్తాయి. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించి ఉబ్బరం, మూత్ర సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది.

రక్తహీనతకు చెక్: అరటి పువ్వులలో ఐరన్‌ సమృద్ధిగా దొరుకుతుంది. తద్వారా రక్తహీనత నుంచి ఉపశమనం పొందవచ్చు. అరటి పువ్వును రెగ్యులర్‌గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల స్థాయి పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..