బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడేవారు ఈ టిప్స్ ఫాలో అయితే తగ్గుతాయట.. మరీ మీరు ట్రై చేయండి..

|

Mar 02, 2021 | 7:44 PM

Blackheads problems removal tips: స్తుప్రత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య బ్లాక్ హెడ్స్. ముఖంపై ఉండే చిన్న చిన్న

బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడేవారు ఈ టిప్స్ ఫాలో అయితే తగ్గుతాయట.. మరీ మీరు ట్రై చేయండి..
Follow us on

Blackheads problems removal tips: స్తుప్రత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య బ్లాక్ హెడ్స్. ముఖంపై ఉండే చిన్న చిన్న మచ్చలను బ్లాక్ హెడ్స్ అంటారు. అయితే ఇవి అమ్మాయిలనే కాకుండా.. అబ్బాయిలను కూడా వేధిస్తుంటాయి. వీటితో చాలా మంది డిప్రెషన్ కు గురవుతుంటారు. వీటిని తొలగించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. అలాగే దుమ్ము, ధూళి ప్రాంతాల్లో తిరగడం వలన ముఖంపై ఉండే చర్మ రంద్రాలలో బాక్టీరియా చేరి బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి. అయితే వీటిని తొలగించుకోవడానికి కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే.. ఈ సమస్య తగ్గుతుందట. మరీ అవెంటో తెలుసుకుందామా..

కావాల్సిన పదార్థాలు..

బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్
మినరల్ వాటర్ కొంచెం.
టూత్ బ్రష్.
ప్లేట్
తెల్లని టూత్ పేస్ట్.

ఎలా చేయాలంటే…

ముందుగా టూత్ పేస్టును ప్టేట్లో తీసుకోవాలి. ఆ తర్వాత చర్మం పీహెచ్ సీ స్థాయిలను అనుసరించే బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల మినరల్ వాటర్ కలిపి మెత్తగా కలపాలి. టూత్ బ్రష్ సహయంతో ఆ మిశ్రమాన్ని ముక్కు, గడ్డం, బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతాల్లో స్క్రబ్ చేయాలి. రెండు నిమిషాలపాటు ముఖాన్ని మృదువుగా, వృత్తాకారంలో మర్దన చేయాలి. ఆ తర్వాత వేడినీటిలో ముంచిన టవల్ తో బ్లాక్ హెడ్స్ ఉన్నచోట సున్నితంగా అద్దాలి. బ్లాక్ హెడ్స్ సమస్య ఎక్కువగా ఉన్నవారు దీనిని ఎక్కువగా చేస్తుండాలి.

ఫేస్ స్క్రబ్..

కావాల్సిన పదార్థాలు..
సగం కట్ చేసిన టమోటా.
పొడి చేసిన చక్కెర రెండు టేబుల్ స్పూన్లు..

ఎలా చేయాలంటే..

ముఖంపై జుట్టును వెనక్కి దువ్వుకుని సగం కత్తిరించిన టమోటాను, మెత్తగా పొడి చేసిన పంచదారను కలిపి ముఖం మొత్తం స్క్రబ్ చేయండి. ఈ విధానంలో మీరు హిమాలయన్ సాల్ట్‌ను కూడా జోడించుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశాల్లో బాగా స్క్రబ్ చేయాల్సి ఉంటుంది.

ముఖాన్ని శుభ్రం చేసుకోవడం..

ముఖంపై చర్మం కాంతివంతంగా ఉండేందుకు, పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చేందుకు, బ్లాక్ హెడ్స్‌ ఉపరితల భాగాలను శుభ్రం చేసేందుకు టంగ్ క్లీనర్‌(నాలుక బద్ద)ను వాడితే ప్రయోజనం ఉంటుంది. మీ ముఖాన్ని శుభ్రం చేసుకునే ముందు టంగ్ క్లీనర్‌ సహాయంతో ముఖాన్ని వాష్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

Also Read:

జుట్టును వదిలేసి నిద్రపోతున్నారా ? మీ జుట్టు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలెంటో తెలుసా ?

Tips For Beautiful Eyelashes : అందమైన, ఒత్తైన కనురెప్పల కోసం సింపుల్ చిట్కాలు మీ కోసం