జుట్టును వదిలేసి నిద్రపోతున్నారా ? మీ జుట్టు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలెంటో తెలుసా ?
మారుతున్న కాలానుగుణంగా మన జీవనశైలి మారుతుంది. దీంతో అనేక రకాల ఆనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు
Hair Tips: మారుతున్న కాలానుగుణంగా మన జీవనశైలి మారుతుంది. దీంతో అనేక రకాల ఆనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు నిత్యం ఎదుర్కోంటున్న సమస్యలలో జుట్టు సంబంధించినవి అనేకం. ఇక హెయిర్ సంరక్షణలో మనం చేసే పొరపాట్ల వలన జుట్టు రాలడం, డండ్రఫ్ రావడం వంటివి జరుగుతుంటాయి. అయితే మీ జుట్టును మరింత అందంగా మారడానికి మీరు చేయవలసిన విషయాలు.. చేయకూడానివి ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
✽ వేడి నీటిలో హెయిర్ వాష్ చేయడం..
సాధారణంగా చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అవి మరీ గోరువెచ్చని నీరు కాకుండా మరీ ఎక్కువగా వేడి ఉండేవి వాడుతుంటారు. మరీ ఎక్కువ వేడి నీటితో హెయిర్ వాష్ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. అలాగే స్కాల్ఫ్ కి మంచిది కాదంట. వేడి వేడి నీరు వాడడం వలన సహజంగా ఉండే నూనే శాతాన్ని తగ్గిస్తుంది.. దీంతో స్కాల్ఫ్ ను డీహైడ్రేటెడ్ అయ్యేలా చేస్తుంది. ఇక గోరువెచ్చని నీటితో స్నానం చేసినా..మీ హెయిర్‌కు చల్లని నీరు లేదా గోరువెచ్చని నీటిని వాడడం ఉత్తమం.
✽ జుట్టును కడిగిన తర్వాత టవల్ కట్టడం..
ముఖ్యంగా మహిళలు హెయిర్ వాష్ చేసిన తర్వాత జుట్టుకు టవల్ కట్టి చాలా సేపు అలానే వదిలేస్తారు. ఎందుకంటే జుట్టు తొందరగా ఆరుతుందని.. టవల్ తో గట్టిగా రుద్దుతుంటారు. ఇలా చెయడంవలన జుట్టు మరింత డ్యామెజ్ అవుతుంది. హెయిర్ వాష్ చేసుకున్నాక టవల్ తో సున్నితంగా జుట్టును అద్దాలి. ఆ తర్వాత కుదుళ్ళ నుంచి చివరి వరకు నెమ్మదిగా తుడవాలి. దాదాపు జుట్టును గాలికి ఆరనిస్తే బెటర్. కొన్ని సందర్భాల్లో చాలా మంది తడి జుట్టునే జడ వేసుకుంటారు. అలా చేయడం అసలు మంచిది కాదు.
✽ తడిగా ఉన్న జుట్టును స్టైల్‍గా మార్చడం..
జుట్టు తడిగా ఉన్నప్పుడు అంటే నీరు కారుతున్న సమయంలో చాలా మంది స్టైల్‍గా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. అలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే తడిగా ఉన్ జుట్టు మీద వేడిని అప్లై చేయడం వలన జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. దాదాపు జుట్టు మొత్తం ఆరిన తర్వాత స్టైల్ గా మార్చుకోవాలి. అప్పుడు జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
✽ తడి జుట్టుతో నిద్రపోవడం..
చాలా మంది స్నానం చేసి హెయిర్ వాష్ చేసుకుని పడుకుంటే అలసటంతా చేత్తో తీసేసినట్టే పోతుందని నమ్ముతుంటారు. అయితే ఇలా చేయడం అసలు మంచిది కాదు. తడి జుట్టు వీక్‌గా ఉంటుంది. నిద్రలో అటూ ఇటూ కదిలినప్పుడు జుట్టు తెగిపోతుంది. ఊడిపోతుంది. ఎప్పుడో ఒకసారి పర్వాలేదు కానీ రెగ్యులర్ గా ఇలా చేస్తుంటే మాత్రం ఆ అలవాటు మానుకోవాలి. తడి జుట్టు అంటే తడి స్కాల్ప్. తడి స్కాల్ప్ తో పడుకుంటే ఫంగస్, బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
✽ ఒకే దగ్గర రబ్బర్ బ్యాండ్ పెట్టడం..
సామాన్యంగా మనం జడ వేసుకున్నా.. పోనీ టెయిల్ వేసినప్పుడు ఒకే దగ్గర రబ్బర్ బ్యాండ్ పెడుతుంటాం. ఇలా చేయడం వలన కూడా జుట్టుకు సమస్యే. ఎందుకంటే జుట్టును ఒకే ప్లేస్ లో లాగినట్లుగా అవుతుంది. ఒక రోజు ఒక అరంగుళం కిందకి బ్యాండ్ పెడితే, మరొక రోజు ఒక అరంగుళం పైకి బ్యాండ్ పెట్టండి. జుట్టుకి కూడా ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉంటుంది.
✽ జుట్టును ఎక్కువసార్లు స్టైల్‍గా మార్చడం..
ప్రస్తుత కాలంలో జుట్టును వివిధ రకాలుగా తీర్చిదిద్దుతుంటారు. ప్రతి ఒక్కరు తమ జుట్టుకు రకారకాల స్టైలింగ్ ఎక్విప్మెంట్స్ వాడుతుంటారు. అయితే జుట్టును స్టైలింగ్ చేయడం ఎప్పుడో ఒకసారి మంచిదే. కానీ అదే రోజూ చేస్తూంటే ప్రమాదం.
✽ జుట్టుతోపాటు.. స్కాల్ఫ్ కూడా ముఖ్యమే..
ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉండడమే. స్కాల్ఫ్ ఆరోగ్యంగా లేకపోతే.. ఎన్ని ప్రయత్నాలు చేసిన హెయిర్ డ్యామెజ్ అవుతుంది. మీ స్కాల్ప్ ని మసాజ్ చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే, చాలా మంది చుండ్రు కనపడకుండా దాచేస్తూ ఉంటారు. దీని వల్ల సమస్య తీవ్రమవుతుందే తప్ప తగ్గదు. తల మీద ఫ్లేకీ గా ఉన్నదంతా చుండ్రు కాకపోవచ్చు కూడా. మీకు చుండ్రు ఉందని మీరు అనుకుంటే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి వారి సూచనల ప్రకారం చేయండి.
✽ జుట్టును వదిలేసి నిద్రపోవడం..
మాములుగా ఎక్కువ మందికి జుట్టును వదిలేసి పడుకోవడం అలవాటు. కానీ అలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే జుట్టు వదిలేసి పడుకోవడం వలన ఎక్కువగా చిక్కు పడిపోతుంది. దీంతో జుట్టు దువ్వినప్పుడు హెయిర్ ఊడిపోవడమే కాకుండా.. జడ వేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలా కాకుండా జడ వేసుకోవడం.. లేదా పోనీ టైల్ వేసుకోని పడుకోవడం చేయాలి.
✽ ఎక్కువగా దువ్వడం..
చాలా మంది జుట్టును పదే పదే దుస్తుంటారు. జుట్టు కాస్తా చుక్కుపడినా మళ్లీ దుస్తుంటారు. ఇలా చేయడం వలన జుట్టుకు నాచురల్ ఆయిల్స్ బాగానే డిస్ట్రిబ్యూట్ అవుతాయి కానీ ఎనిమిది తొమ్మిది సార్ల కంటే ఎక్కువ దువ్వక్కరలేదు. ఎక్కువ సార్లు దువ్వడం వల్ల జుట్టు లాగినట్లుగా అవుతుంది, క్యుటికల్ లేయర్ పాడవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. అలాగే, ఎలాంటి జుట్టుకి ఎలాంటి దువ్వెన వాడాలో కూడా తెలిసి ఉండాలి. ఒత్తుగా, కర్లీగా ఉన్న హెయిర్ కి పళ్ళు వెడల్పుగా ఉన్న దువ్వెన కావాలి. స్టైలింగ్ కి రౌండ్ బ్రిజిల్స్ ఉన్న దువ్వెన కావాలి. బాగా చిక్కు పడే జుట్టుకి పాడిల్ బ్రష్ కావాలి. మీ హెయిర్ టైప్ ని బట్టి మీకు సరిపోయే దువ్వెన ఎంచుకోండి.
✽ ఆయిల్ పెట్టకపోవడం..
జుట్టుకు ఆయిల్ పెట్టడం ముఖ్యం. కానీ ఆయిల్ పెట్టడం చాలా మందికి ఇష్టం ఉండదు. దీంతో జుట్టు నిర్జీవంగా పొడిబారినట్టుగా ఉంటుంది. హెయిర్ వాష్ కి ముందు ఆయిల్ పెట్టడం వలన మీ జుట్టు చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఏర్పడుతుంది. ఇది హెయిర్ వాష్ జెంటిల్‌గా జరిగేలా చూస్తుంది. ఇందుకు కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ బాగా హెల్ప్ చేస్తాయి. అయితే ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు జుట్టుకు ఆయిల్ ఉండడం మంచిది కాదు.
Also Read:
సోంపు నోటి దుర్వాసనను పోగొట్టమే కాదు.. 8 రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. ఎంటో తెలుసా..