Lady Finger Curry: బెండకాయ కూరంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా శాఖాహారులకైతే ఇది ఒక మాంసాహారం లాంటిది. ఇందులో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, రాగి మొదలైన పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు బెండకాయ తినమని సలహా ఇస్తారు.బెండ ఒక పచ్చి కూరగాయ. అందువల్ల ఇది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కానీ కొన్నిసార్లు మనం చేసే తప్పుల కారణంగా అది మనకు విషం కూడా కావచ్చు. బెండకాయ కూరతో భోజనం చేశాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం. బెండకాయ కూరతో భోజనం చేశాక మనం చాలా కూరగాయలు తింటాం. అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే బెండకాయ తిన్న తర్వాత ముల్లంగిని వెంటనే తినవద్దు. అంతేకాదు మహిళలు బెండకాయను, ముల్లంగితో పాటు సలాడ్ రూపంలో తీసుకుంటే చర్మ సమస్యలను కలిగిస్తుంది.
ముల్లంగిని, బెండకాయతో తీసుకుంటే ముఖంపై మరకలు ఏర్పడుతాయి. మీరు ఈ తప్పును పదేపదే చేస్తే మీ శరీరంపై మచ్చలు ఏర్పడుతాయి. వాటికి ఎంత చికిత్స తీసుకున్నా అవి పోవు. ముల్లంగిని బెండకాయతో కలిపి తీసుకుంటే ముఖంపై దద్దుర్ల సమస్య కూడా వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అలాగే బెండకాయ తిన్న తర్వాత చేదు పదార్థాలు, కూరగాయలు ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే కడుపులోకి వెళ్లిన తర్వాత అది విషంగా మారుతుంది. అప్పుడు మరణించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల బెండకాయ తిన్న తర్వాత చేదుతో కూడిన పదార్థాలు అస్సలు తినకూడదు.