Coconut Milk Benefits: కొబ్బరి పాలతో జుట్టు, చర్మ సమస్యలకు చెక్.. ఇలా వాడితే ప్రయోజనాలు ఎక్కువే అంటున్న నిపుణులు…

|

Jul 09, 2021 | 10:47 AM

ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాలు... జుట్టు, చర్మ సమస్యలకు తగ్గించడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులో షుగర్,

Coconut Milk Benefits: కొబ్బరి పాలతో జుట్టు, చర్మ సమస్యలకు చెక్.. ఇలా వాడితే ప్రయోజనాలు ఎక్కువే అంటున్న నిపుణులు...
Coconut Milk
Follow us on

ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాలు… జుట్టు, చర్మ సమస్యలకు తగ్గించడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులో షుగర్, ఎలక్ర్టోలైట్లు అధికంగానే ఉంటాయి. వీటిని పాలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి పాలు.. రక్తపోటును మెరుగుపరచడమే కాకుండా.. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో కార్డియాక్ అరిథ్మియాను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, ఇ, బి1, బి3, బి5, బి6, ఐరన్, సెలీనియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఉంటాయి. ఇందులో లౌరిక్ అమ్లం ఉంటుంది. అంతేకాకుండా.. చైన్ ఫ్యాటీ యాసిడ్ శరీరంలో మోనోలౌరిక్‏గా మారుతుంది. ఇది యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కలిగి ఉంటుంది. ఈ ఆమ్లం మెదడు పనితీరు, ఎముకల ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొబ్బరి పాలు.. తల్లిపాలతో సమానమైన శక్తిని కలిగి ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

* కొబ్బరి పాలు జుట్టు సమస్యలను తగ్గించి.. పెరుగుదలకు సహాయపడతాయి. రోజు కొబ్బరి పాలతో 3 నుంచి 5 నిమిషాలు జుట్టుపై మసాజ్ చేసి.. 20 నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేయడం వలన జుట్టు సమస్యలు తగ్గుతాయి. అలాగే కొబ్బరి పాలను లీవ్ ఇన్ కండీషనర్‏గా ఉపయోగించవచ్చు.
* కొబ్బరి పాలలో 2 చుక్కల ఆలీవ్ ఆయిల్ కలిపి కాటన్‍‏తో మేకప్ తొలగించాలి. ఇది చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది.
* ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల వలన మొటిమలను నియంత్రించవచ్చు. అలాగే ముఖంపై ఉండే రంధ్రాలను ఇవి తెరుచుకునేలా చేయడం ద్వారా మొటిమల సమస్యను నివారించవచ్చు. అలాగే కొబ్బరి పాలలో ఓట్స్ కలిపి 10 నిమిషాలు ముఖంపై అప్లై చేసి.. శుభ్రం చేసాక ముఖం మరింత మెరుపునిస్తుంది.
* ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మం పై ముడతలు, వయస్సు మచ్చలను తగ్గించడంలో కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. 6-7 బాదం పప్పులను రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే వాటి పొట్టును తొలగించి పేస్ట్‏గా చేయాలి. అందులో 5-6 చుక్కల కొబ్బరి పాలు కలిపి ఆ మిశ్రమాన్ని 15 నిమిషాలు ముఖంపై అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
* కొబ్బరి పాలను సూర్యరశ్మి చర్మానికి వాడడం వలన శోథ నిరోధక లక్షణాల వలన చర్మ సమస్యలు తొలగిపోవడమే కాకుండా.. నొప్పి, వాపు, మంట తగ్గుతుంది.
* కొబ్బరి పాలను 20-30 నిమిషాలపాటు.. చర్మంపై నేరుగా రాయడం వలన చర్మం ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఒక కప్పు గులాబీ రేకులు, 1/2 కప్పు రోజ్ వాటర్, కప్పు కొబ్బరి పాలను ఒక టబ్‏లో గోరువెచ్చని నీటిలో కలపాలి. ఆ నీటితో స్నానం చేయడం వలన చర్మం నిత్యం తేమగా ఉంటుంది. అలాగే 1/2 కప్పు వోట్మీల్ పేస్ట్ గా చేసి 1-2 కప్పుల కొబ్బరి పాలను ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి కూడా ఉపయోగించవచ్చు.
* కొబ్బరి పాలు.. చర్మ శోథ, సోరియాసిస్, పొడి చర్మ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సహజ కొవ్వు ఆమ్లాలు ఉండడం వలన పొడి చర్మం, మంట, దురద వంటి సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Also Read: MLA Roja vs Revanth Reddy: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన రేవంత్ రెడ్డా?.. కోవర్డ్ రెడ్డా? అంటూ..