కరోనా కేసులు రోజురోజూకీ మరింతగా పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా కొంత వరకు పెరుగుతోంది. అయితే ఈ మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది బలహీనంగా ఉండడం, అలసట, బద్దకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరీ ఈ సమస్యలను తగ్గించుకోవడానికి సరైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవెంటో తెలుసుకుందామా.
1. నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలతో తీసుకోవడం మంచిది. నానబెట్టిన బాదం మీ శరీరంలోని కొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్ అయిన లిపేస్ విడుదల చేయడంలో సహయపడుతుంది.
2. రాగిలో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రాగి దోశను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తినడం వలన బలహీనమైన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో పాలీఫెనాల్ కంటెంట్ డయాబెటిక్ రోగులలో గ్లైసెమిక్ ప్రతిస్పందన తగ్గిస్తుంది. గంజిలో కాల్షియం, భాస్వరం ఉన్నందున ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎర్రరక్త కణాలను పెంచడంలో సహయపడుతుంది.
3. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యి కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ ఎ, ఇ, డిలు సమృద్దిగా ఉంటాయి. అలాగే ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహయపడే కాల్షియం, విటమిన్ కె కూడా సమృద్ధిగా ఉంటాయి.
4. కిచిడి. ఇందులో 10 ఆమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది పూర్తిగా ప్రోటీన్ ఫ్యాక్ట్ డైట్. అలాగే ఇందులో వెజిటేజీలు శరీరానికి తగినంత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనిలో నెయ్యి కలపడం వలన ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా అందిస్తాయి.
5. నీరు, షెర్బత్, చాస్.. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు సహయపడతాయి. నీరు తాగడం, ఇంట్లో తయారు చేసిన షెర్బత్, చాస్ తీసుకోవడం వలన హైడ్రేట్ గా ఉండటమే కాకుండా శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహయపడతాయి. అలాగే ఎండాకాలంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Also Read: కరోనా పోరులో మేము సైతం అంటున్న టాలీవుడ్ హీరోలు.. ప్లాస్మా దానం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్న తారలు..
ఎన్టీఆర్‌కు ఆ సీనియర్ హీరో… మరోసారి బ్లాక్ బస్టర్ కోసం స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్న కొరటాల..