Banana Leaf : అరటి ఆకును మించిన ఆకు లేదు. పూర్వకాలం నుంచి అరటి ఆకులలో అన్నం తినే సంప్రదాయం మనది. అందుకే అప్పటివారు ధృడంగా, ఆరోగ్యంగా ఉండేవారు. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం వస్తుందని మన పెద్దలు చెప్పేవారు. అరటి ఆకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం.
ఈ భూమిపై ఎన్నో రకాల ఆకులు ఉన్నా అరటి ఆకును మాత్రమే భోజనం చేయడానికి ఎంచుకోవడానికి చాలా కారణాలున్నాయి. అరటి ఆకులో విషాహారం పెడితే వెంటనే తెలిసిపోతుంది. వెంటనే ఆకు నల్లగా మారిపోతుంది. వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వల్ల ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వల్ల భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.
ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్మ రియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.
ధర్మ శాస్త్రం ప్రకారం అన్నీ వడ్డించిన విస్తరి ముందు కూర్చోరాదు. కూర్చున్న తరువాతే వడ్డించుకుని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రాబోయే రోజుల్లో దరిద్రం చుట్టుకుట్టుంది. ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే.. తూర్పునకు అభిముఖంగా భోజనం చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే దీని వల్ల దీర్గాయుష్షు లభిస్తుంది.