AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tawa Paneer Tikka Masala: వహ్వా.. తవాపై పనీర్ టిక్కా.. ఈ స్నాక్ చేస్తే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుని తింటారు!

సాయంత్రం వేళ వేడివేడిగా, కాస్త స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తే సాధారణంగా బజ్జీలు, బోండాలు, పకోడీల వైపు వెళ్తుంటాం. అయితే ప్రతిరోజూ అవే స్నాక్స్ తినడం బోర్ కొడితే ఈసారి ఇంట్లోనే తవా పనీర్ టిక్కా మసాలా ప్రయత్నించవచ్చు. రెస్టారెంట్‌లో దొరికే పనీర్ టిక్కా తరహాలోనే దీన్ని పెనంపై సులభంగా తయారు చేసుకోవచ్చు. పనీర్‌తో పాటు పెరుగు, క్యాప్సికమ్, ఉల్లిపాయ, వివిధ మసాలా దినుసులు కలవడంతో మంచి రుచి, సువాసన వస్తాయి.

Tawa Paneer Tikka Masala: వహ్వా.. తవాపై పనీర్ టిక్కా.. ఈ స్నాక్ చేస్తే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుని తింటారు!
Tawa Paneer Tikka Masala Recipe
Bhavani
|

Updated on: Sep 05, 2026 | 5:32 PM

Share

ఈ రెసిపీ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా పనీర్, కూరగాయలను మసాలా పెరుగు మిశ్రమంలో ఊరబెట్టి, ఆ తర్వాత తవాపై నెమ్మదిగా వేయిస్తే సరిపోతుంది. చివర్లో చాట్ మసాలా చల్లి గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ సలాడ్, నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తే సాయంత్రం స్నాక్‌గా అదిరిపోతుంది.

1. కావాల్సిన పదార్థాలు

పనీర్ – 250 గ్రాములు

పెరుగు – ½ కప్పు

పసుపు – ½ టీస్పూన్

కాశ్మీరీ ఎర్ర మిరప పొడి – 1 టీస్పూన్

ధనియాల పొడి – ½ టీస్పూన్

జీలకర్ర పొడి – ½ టీస్పూన్

గరం మసాలా – ½ టీస్పూన్

కసూరి మెంతి – ½ టీస్పూన్

చాట్ మసాలా – ½ టీస్పూన్

అల్లం-వెల్లుల్లి పేస్ట్ – ½ టీస్పూన్

వాము – ½ టీస్పూన్

శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు

నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – 3 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయ – ½

క్యాప్సికమ్ – ½

2. ముందుగా మసాలా మిశ్రమం తయారు చేయాలి

ఒక పెద్ద గిన్నెలో పెరుగు తీసుకుని అందులో పసుపు, కాశ్మీరీ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మెంతి, చాట్ మసాలా, అల్లం-వెల్లుల్లి పేస్ట్, వాము వేయాలి. అనంతరం శనగపిండి, నిమ్మరసం, ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి.

3. పనీర్‌ను ఊరబెట్టాలి

ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పనీర్‌ను మసాలా మిశ్రమంలో వేయాలి. ఒక టీస్పూన్ నూనె వేసి పనీర్ ముక్కలు విరగకుండా మెల్లగా కలపాలి. ఇలా సిద్ధం చేసిన మిశ్రమాన్ని సుమారు 30 నిమిషాల నుంచి గంట వరకు ఫ్రిజ్‌లో ఉంచితే మసాలా పనీర్‌కు బాగా పడుతుంది.

4. తవాపై పనీర్ టిక్కా తయారీ

పుల్లలు ఉంటే వాటిపై పనీర్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోవచ్చు. పుల్లలు లేకపోతే నేరుగా తవాపైనే వేయించుకోవచ్చు. ముందుగా పెనాన్ని మధ్యస్థ మంటపై వేడి చేసి కొద్దిగా నూనె వేయాలి. తర్వాత ఊరబెట్టిన పనీర్, కూరగాయలను తవాపై వేసి అన్ని వైపులా నెమ్మదిగా వేయించాలి.

5. చివర్లో ఇలా చేస్తే రుచి మరింత పెరుగుతుంది

పనీర్, కూరగాయలు లేత బంగారు రంగులోకి వచ్చే వరకు మధ్యమధ్యలో తిప్పుతూ వేయించాలి. చివర్లో కొద్దిగా చాట్ మసాలా చల్లితే మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది. వేడివేడిగా గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ సలాడ్, నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తే సాయంత్రపు స్నాక్‌గా ఎంతో రుచిగా ఉంటుంది.

 

Follow Us