
సులైమాని టీ కేరళకు చెందిన ఒక ప్రత్యేకమైన, రుచికరమైన టీ. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది కనుక దీనిని సాధారణంగా భోజనం తర్వాత తీసుకుంటారు. దీనిని మలబార్ ప్రాంతంలో ప్రత్యేకంగా హైదరాబాదీ సులేమాని టీ అని పిలుస్తారు. ఇది సాధారణ టీ కంటే కొంచెం భిన్నమైన రుచిని అంటే తీపి, పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. పాలు లేకుండా తయారు చేసే సులైమాని టీని మిరియాలు, యాలకులు, స్టార్ పువ్వు, సోంపు వంటి మసాలాలతో తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన సులైమాని టీ బ్లాక్ టీ. భోజనం తర్వాత ఈ టీని తాగడం వలన హాయిని కలిగిస్తుంది.
సులైమాని టీ ప్రయోజనాలు: ఈ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. సుగంధాలు ఉండడం వలన భోజనం తర్వాత ఈ టీని తాగడం వలన హాయిని కలిగిస్తుంది.
సులైమాని టీని కేరళలో ఆతిథ్యానికి ఒక సంప్రదాయంగా భావిస్తారు. ఇది స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తమ భావాలను ఈ టీతో పంచుకుంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)