Weight Loss Tip : వ్యాయామం చేయడానికి అరగంట ముందు కాఫీ తాగితే.. కలిగే ఫలితం ఏమిటో తెలుసా..!

కాఫీ ప్రియులందరికీ శుభవార్త! ఒక కప్పు కాఫీని ఉదయం తాగితే.. నిద్ర బద్ధకాన్ని అధిగమించడంలో సహాయపడుతుందట. అంతేకాదు.. వ్యాయామం చేయడానికి ముందు ..

Weight Loss Tip : వ్యాయామం చేయడానికి అరగంట ముందు కాఫీ తాగితే.. కలిగే ఫలితం ఏమిటో తెలుసా..!
Cup of Coffee before Exercise: ఆధునిక ప్రపంచంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఊబకాయం.. మారుతున్న జీవనశైలీ, ఆహారం, ఒత్తిడి ఇవన్నీ కూడా శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కావున చాలా మంది బరువు తగ్గేందుకు లేనిపోని ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. వర్కవుట్లు, డైట్లు చేస్తూ ఎంతో కష్టంతో బరువు తగ్గేందుకు శ్రమిస్తుంటారు.

Updated on: Mar 25, 2021 | 8:05 AM

Weight Loss Tip: కాఫీ ప్రియులందరికీ శుభవార్త! ఒక కప్పు కాఫీని ఉదయం తాగితే.. నిద్ర బద్ధకాన్ని అధిగమించడంలో సహాయపడుతుందట. అంతేకాదు.. వ్యాయామం చేయడానికి ముందు .. ఒక కప్పు కాఫీ తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఒక కొత్త అధ్యయనంలో తేలిందట.
ఈ అధ్యయనం యొక్క ఫలితాలు

అధ్యయనం యొక్క ఫలితాలు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురించబడ్డాయి. స్ట్రాంగ్ కాఫీని వ్యాయామం చేయడానికి ఓ అరగంట ముందు తాగితే.. అప్పుడు కొవ్వు కరిగిన శాతం గణనీయంగా పెరిగిందని గ్రెనడా విశ్వవిద్యాలయం (యుజిఆర్) యొక్క ఫిజియాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు చెప్పారు.

అయితే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయమని సర్వసాధారణంగా సిఫార్స్ చేస్తారు. ఈ సిఫార్సుకు శాస్త్రీయ ప్రాతిపదిక లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఉదయం చేసే వ్యాయామంలో ఎక్కువ సమయం ఆహారం తిందకుండా చేయడం వల్ల బరువు తగ్గింది అని భావించవచ్చు అని అంటున్నారు.
అయితే తాజాగా అధ్యయనంలో మొత్తం 15 మంది పురుషులు (సగటు వయస్సు, 32) పాల్గొన్నారు. ఏడు రోజుల వ్యవధిలో నాలుగుసార్లు వ్యాయామం చేసే సమయంలో పరీక్షించారు. ఉదయం 8 మరియు సాయంత్రం 5 గంటలకు స్ట్రాంగ్ కాఫీని తగినవారిలో వ్యాయామం మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు.

ప్రతి వ్యాయామ పరీక్షకు ముందు పరిస్థితులు (చివరి భోజనం, శారీరక వ్యాయామం, పని గంటలు) ఖచ్చితంగా ప్రామాణికం తీసుకున్నారు. అంతేకాదు వ్యాయామం చేసే సమయంలో కొవ్వు ఆక్సీకారణాన్ని లెక్కించారు.

దీంతో తమ అధ్యయనం లో ఏరోబిక్ వ్యాయామ పరీక్ష చేయటానికి 30 నిమిషాల ముందు స్ట్రాంగ్ కాఫీని తాగిన వారు.. వ్యాయామం సమయంలో కొవ్వు అధికంగా కరిగిందని ఫ్రాన్సిస్కో జె. అమారో వివరించారు. కనుక ఇక నుంచి రోజూ ఎక్సర్సైజ్, వ్యాయామం, ఏరోబిక్స్ కు వెళ్లేవారు.. ఓ అర్ధగంట ముందు.. మంచి రుచికరమైన స్ట్రాంగ్ కాఫీని తాగండి.. త్వరగా కొవ్వుని కరిగించుకోండి.

Also Read: నేటి మార్కెట్ లో స్థిరంగా ఉన్న పసిడి ధర.. తగ్గిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల్లోకి వెళ్తే..!

పెరుగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి కాస్త ఉపశమనం.. స్వల్పంగా తగ్గిన ధరలు..