
మఖానాలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదిస్తాయి. ఎక్కువ కాలం యవ్వనాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మఖానా తినడం వల్ల ఎముకలు బలపడతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మీరు వయసు పెరిగే కొద్దీ, ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మఖానా తినాలని చెబుతున్నారు. ఈ ఎండిన పండు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
కుటుంబం ప్రతిరోజూ ఒకే తరహా కూరలు తినడం విసుగు పడుతుంటే పనీర్, పూల్ మఖానా, జీడిపప్పుతో కూరని తయారు చేసుకొండి. దీనిని తయారు చేయడం సులభం. రుచిలో ఈ కూరగాయ షాహి పనీర్ లా అనిపిస్తుంది. అయితే మఖానా ఈ కూరకు మరింత మెరుగైన రుచిని తెస్తుంది. మఖానా జీడిపప్పు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
మఖానా జీడిపప్పు కర్రీ తయారీకి కావాల్సిన పదార్దాలు:
- టమోటాలు – 3
- పచ్చిమిర్చి – 1
- అల్లం – 1/2 టీస్పూన్
- జీడిపప్పు – 10 ముక్కలు
- పనీర్ – 200 గ్రాములు
- పూల్ మఖానా – 2 కప్పులు
- నెయ్యి – 3 టీస్పూన్లు
- నూనె – 1 చిన్నస్పూన్
- బే ఆకు – 1
- దాల్చిన చెక్క – 1
- మిరియాలు – 6
- లవంగాలు – 2
- యాలకులు – 1
- జీలకర్ర – 1 టీస్పూన్
- ధనియాల పొడి – 1 స్పూన్
- పసుపు – 1 స్పూన్
- కాశ్మీరీ కారం – 1.5 టీస్పూన్లు
- కసూరి మేథి – 1 టీస్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- తాజా క్రీమ్ లేదా పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర – ఒక కట్ట
తయారీ విధానం: కూర తయారీకి ముందుగా టమోటాలు, పచ్చిమిర్చి, అల్లంను కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. దీని తరువాత రెండు కప్పుల మఖానాను బాగా వేయించాలి. ఇప్పుడు కూరను చేయడానికి రెడీ అవ్వాలి.
- మఖానాలు వేయించిన తర్వాత, వాటిని ఒక ప్లేట్ లో వేసి వాటిని చల్లబరచండి.
- ఇప్పుడు గ్యాస్ స్టవ్ తీసుకుని పాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనె, కొంచెం నెయ్యి వేసి వేయండి.
- నూనె వేడి ఎక్కిన తర్వాత బే ఆకు, దాల్చిన చెక్క ముక్క, మిరియాలు, లవంగాలు, జీలకర్ర వంటి మసాలా దినుసులను వేసి వేయించాలి. ఈ మసాలాలో టమోటా అల్లం పేస్ట్ వేసి బాగా వేయించాలి.
- మంటను తగ్గించి ధనియాల పొడి, పసుపు, కాశ్మీరీ కారం , వెజిటబుల్ మసాలా పొడి వేసి వేయించాలి.
- ఈ మసాలా మిశ్రమాన్ని కలుపుతూ… నూనె వేరు అయ్యే వరకు వేయించాలి.
- తర్వాత ఈ టమాటా మసాలా మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల తాజా పాల క్రీమ్ జోడించండి. క్రీమ్ లేకపోతే చిక్కటి పెరుగు వేసి కొంచెం వేయించాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమంలో 2, 3 చిన్న గిన్నెల నీళ్లు పోసి రుచికి తగినట్లుగా ఉప్పు వేయాలి.
- ఇప్పుడు టమాటా మసాలా మిశ్రమంలో పనీర్ , మఖానాను వేసి వేయించాలి.
- అదే సమయంలో మరో గిన్నెలో జీడిపప్పును వేయించి.. ఉడుకుతున్న కూరలో వేసి కూరని కలిపి బాగా ఉడికించాలి. చివరగా కసూరుమేథీ కొత్తిమీరను వేసి బాగా కలిపి.. నూనె కూర నుంచి వేరు అవుతుంటే మఖానా జీడిపప్పు కర్రీ రెడీ అయినట్లే.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..