చలికాలంలో బాడీలో ఇది లేకపోతే ఎర్రటి అరటిపండు తినాలి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

|

Dec 15, 2021 | 8:57 AM

Red Banana: ఆరోగ్యకరమైన ఆహారం మీ జీవనశైలిని చెడిపోకుండా కాపాడుతుంది. ఇందులో ముఖ్యమైనవి పండ్లు. వీటిని ఎంత ఎక్కువగా తింటే శరీరానికి

చలికాలంలో బాడీలో ఇది లేకపోతే ఎర్రటి అరటిపండు తినాలి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Banana
Follow us on

Red Banana: ఆరోగ్యకరమైన ఆహారం మీ జీవనశైలిని చెడిపోకుండా కాపాడుతుంది. ఇందులో ముఖ్యమైనవి పండ్లు. వీటిని ఎంత ఎక్కువగా తింటే శరీరానికి అంత మంచిది. ఇందులో మొదటి స్థానంలో అరటిపండ్లు ఉంటాయి. అరటి పండ్లు న్యూట్రీషియన్-రిచ్ ఫ్రూట్‌. ప్రపంచవ్యాప్తంగా 18 రకాల అరటిపండ్లు ఉన్నాయి. భారతదేశంలో పసుపు, ఆకుపచ్చ మాత్రమే తింటారు. ఈ రెండు కాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఎర్రటి అరటి కూడా ఉంది. దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. ఎర్రటి అరటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు సరైన మొత్తంలో లభిస్తాయి. దీని సహాయంతో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. ఈ అరటిపండు ఆస్ట్రేలియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ దొరుకుతుంది. ఈ అరటిపండును రెడ్ డాకా అని కూడా అంటారు.

1. రోగనిరోధక శక్తి
కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రజలు అన్ని రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. మీరు కూడా ఈ కోవలోనే ఉంటే ఎర్రటి అరటిపండును ఆహారంలో చేర్చుకోండి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, విటమిన్ బి6 ఇందులో పుష్కలంగా ఉంటాయి.

2. శక్తి
ఉదయపు అల్పాహారంలో ఎర్రటి అరటిపండును చేర్చినట్లయితే అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతంగా ఉండటం వల్ల మీరు ఫ్రెష్‌గా ఉంటారు రోజు చక్కగా గడుస్తుంది.

3. బరువును తగ్గిస్తుంది
ఊబకాయం కారణంగా రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ఎర్రటి అరటిపండు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ అరటిపండు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు దీనివల్ల అతిగా తినకుండా ఉంటారు.

4. కళ్లకు మేలు చేస్తుంది
కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో ఎర్రటి అరటిపండు చాలా సహాయకారిగా పనిచేస్తుంది. వాస్తవానికి కంటి సమస్యలను తొలగించడంలో లుటిన్, బీటా కెరోటిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ రెండూ ఎర్రటి అరటిపండులో ఉంటాయి. అందుకే ఈరోజు నుంచే మీ ఆహారంలో ఎర్రటి అరటిపండును చేర్చుకోండి.

5. రెడ్ బనానా షేక్
ఎర్రటి అరటి షేక్ చేయడానికి పాలు, యాలకులు, జాజికాయ ఉపయోగించండి. రోజూ కాకపోయినా వారానికి మూడుసార్లు ఈ షేక్ తాగండి. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి.

చాణక్య నీతి: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆచార్య చెప్పిన ఈ 4 విషయాలు ఎప్పుడు మర్చిపోకండి..

Skin Care Tips: ముఖం నిగారింపు కోసం సహజసిద్దమైన 5 పద్దతులు.. ఏంటో తెలుసుకోండి..

UGC: యూనివర్సిటీ, కాలేజీలలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారా..! యూజీసీ ఏం చెబుతోంది..?